Venkatarami Reddy Dismiss: ఏపీ ప్రభుత్వం సంచలనం.. వైసీపీకి ప్రచారం చేశారంటూ ఉద్యోగం నుంచి డిస్మిస్

ఉద్యోగం నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేయడంతో రిటైర్ మెంట్ బెన్ఫిట్స్ కూడా వెంకట్రామిరెడ్డి కోల్పోయారు.

  • Updated on- April 20, 2026 / 06:37 PM IST

 

Venkatarami Reddy Dismiss: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారన్న ఆరోపణలపై వెంకట్రామి రెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 43 ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది జీఏడీ. ఉద్యోగం నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేయడంతో రిటైర్ మెంట్ బెన్ఫిట్స్ కూడా వెంకట్రామిరెడ్డి కోల్పోయారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారు అనే ఆరోపణలపై ఇదివరకే రెండేళ్లుగా వెంకట్రామి రెడ్డి సస్పెన్షన్ లో ఉన్నారు. 24 ఏళ్లు ఏపీ సెక్రటేరియేట్ లో సర్వీస్ చేసిన వెంకట్రామిరెడ్డి. మరో 14 ఏళ్లు సర్వీసు ఉండగానే ఉద్యోగం నుండి డిస్మిస్ అయ్యారు.

Also Read: మహిళా బిల్లు వీగిపోవడం బీజేపీ ఫెయిల్యూర్ కాదా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ రఘునందన్ రావు రియాక్షన్ ఇదే..