AP Govt
AP Govt : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మహిళలకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో రైతులకు కూటమి సర్కార్ తీపికబురు చెప్పింది.
ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్న రైతులకు ఊరట దక్కింది. అంతేకాదు.. ఈ నెలాఖరులోగా పెండింగ్ కనెక్షన్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదేశించింది. పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అనుమతి మంజూరు విషక్ష్ంలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దని, త్వరగా క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
గత ప్రభుత్వం హయాంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి సుమారు 50వేల కొత్త దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటితో కలిపి డిస్కంలు సుమారు 1.12లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 22.30లక్షలకు చేరింది. 2025 జనవరి నుంచి డిస్కంల పరిధిలో అందిన దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి.
నిబంధనల ప్రకారం.. రైతుల నుంచి దరఖాస్తు వచ్చిన రెండు నెలల్లోనే కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, సిబ్బంది కొరత, ఇతర సమస్యల కారణంగా కొత్త కనెక్షన్ల మంజూరు ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రెండు నెలల్లో అందుబాటులోకి తేవాలని డిస్కంలను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అందుకు అవసరమైన సామాగ్రిని విద్యుత్ సంస్థలు సమకూర్చుకుంటున్నాయి.
ప్రస్తుతం డిస్కంల వద్ద 25 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్లు ఈపీడీసీల్‌లో 7,382, సీపీడీసీఎల్‌లో 266, ఎస్‌పీడీసీఎల్‌లో 88 ఉన్నాయి. పెండింగ్ కనెక్షన్లకు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు కనీసం మరో 10వేల వరకు అవసరం ఉంటాయి. రెండు నెలల్లో పెండింగ్ లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను అందుబాటులోకి తేవాలని డిస్కంలను ఆదేశించడం జరిగింది. అందుకు అవసరమైన సామాగ్రిని విద్యుత్ సంస్థలు సమకూర్చుకుంటున్నాయి. ముందుకు వాటికి అంచనాలు తయారు చేసి, మంజూరుకు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.