AP Salary Hike : ఏపీలోని ఆ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త.. ఏకంగా 10 శాతం జీతం పెంపు..
AP Salary Hike : కూటమి సర్కార్ ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
- Dharani Pilli
- Updated on- May 26, 2026 / 03:54 PM IST
Ap Government Salary hikes upto 10 percent For Lepakshi Outsourcing Employees
- కూటమి సర్కార్ కీలక నిర్ణయం
- లేపాక్షి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు
- 10 శాతం వేతనాల పెంపుకు ఆమోదం
AP Salary Hike : ఉద్యోగులకు శుభవార్త.. వారి జీతాలు పెరగనున్నాయి. అది కూడా ఏకంగా 10 శాతం. ఇంతకీ ఏ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్‌లో. తాజాగా ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ అమరావతి కేంద్రంగా పనిచేస్తున్న లేపాక్షి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ ఉద్యోగుల జీతాలను పెంచుతూ మంత్రి సవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో ఉన్న లేపాక్షి షోరూమ్‌లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో వీటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక బోనాంజాగా.. వారి వేతనాలు 10 శాతం పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం… ప్రస్తుతం ఏపీలో లేపాక్షి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అందిస్తున్న మూల వేతనంపై 10 శాతం కంటే ఎక్కువ పెంపు వర్తింపజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లేపాక్షి షోరూమ్‌ల అమ్మకాలు రూ.60.75 కోట్లకు పెరగడంతో కూటమి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ… లేపాక్షి షోరూమ్‌లలో అమ్మకాలు పెంచడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లేపాక్షి షోరూమ్‌లలో అమ్మకాలను రూ.80 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు. హస్తకళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి సవిత స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం.. కళాకారులకు మార్కెట్ అవకాశాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవడం మాత్రమే కాక.. ఇటు ఉద్యోగుల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు.
*అవి వాస్తవాలు.. బాలకృష్ణపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రశంసలు
ఇదిలా ఉంటే ప్రభుత్వం తమ జీతాలు 10 శాతం పెంచినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి సవితకు లేపాక్షి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటామని స్పష్టం చేశారు.
