Amarajeevi Jaladhara Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపే ‘అమరజీవి జలధార’ పథకం ప్రారంభం.. 27.36 లక్షల ఇళ్లకు కుళాయిలు

ఏపీలో 'అమరజీవి జలధార(Amarajeevi Jaladhara Scheme)' బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

AP government set to launch Amarajeevi Jaladhara scheme tomorrow

Amarajeevi Jaladhara Scheme: ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి, పల్లెల పురోగతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక రక్షిత మంచి నీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరు వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘జల్ జీవన్ మిషన్’ – ‘అమరజీవి జలధార(Amarajeevi Jaladhara Scheme)’ బృహత్తర కార్యక్రమాన్ని వారిద్దరూ సంయుక్తంగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామీణ ఏపీలో ప్రతి ఇంటా తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించాలనే ఆశయంతో రూ. 30,156 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ మెగా ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం రూపొందించింది.

Hyderabad Municipal Act: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త మున్సిపల్ చట్టం.. ఒక్క బిల్లులోనే పన్నులు, నీటి ఛార్జీలు!

27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు.. మారనున్న పల్లెల స్వరూపం:

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి స్వచ్ఛమైన మంచినీటిని చేర్చడమే ధ్యేయంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ కింద ఏకంగా 27.36 లక్షల నూతన ఇంటింటి కుళాయి (టాప్) కనెక్షన్లను అందజేయనున్నారు. దశాబ్దాలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ మైళ్ల కొద్దీ నడవాల్సిన గ్రామీణ మహిళల కష్టాలకు ఈ పథకం ద్వారా చరమగీతం పాడనున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీవన ప్రమాణాలను ఎత్తైన స్థాయికి తీసుకువెళ్లాలనే ప్రభుత్వ సంకల్పానికి ‘అమరజీవి జలధార’ ప్రతిరూపంగా నిలుస్తుందని అధికారులు వెల్లడించారు.

ప్రొద్దుటూరులో ప్రత్యేక ప్లాయిల్ ఆవిష్కరణ.. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి:

సోమవారం ఉదయం 11:20 గంటలకు ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ‘జల్ జీవన్ మిషన్’ ప్రత్యేక ప్లాయిల్‌ను ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఉభయ నేతలు ప్రసంగించనున్నారు. ప్రభుత్వ భవిష్యత్ సంక్షేమ, అభివృద్ధి కార్యాచరణను వివరించేందుకు ఈ సభను వేదికగా మలచుకోనుండగా, జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు అత్యున్నత స్థాయి భద్రతతో పాటు అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు.