ఏపీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ స్పీచ్ హైలైట్స్.. వైసీపీ టార్గెట్ గా..
AP Assembly : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.
- Harishth Thanniru
- Published On : February 11, 2026 / 11:15 AM IST
AP Governor Abdul Nazeer
AP Assembly : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విభజన సమస్యలతో పాటు వారసత్వంగా వచ్చిన ఆర్ధిక కష్టనష్టాలతో ప్రభుత్వం పాలన ప్రారంభించిందని, విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గత పాలకులు ధ్వంసం చేశారని గవర్నర్ అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో అభివృద్ధి ఆగిపోయింది. ఆర్ధిక పరమైన ఇబ్బందులు పెరిగాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా గత పాలకులు పాలించారు. 22ఏ దుర్వినియోగం చేశారు. మౌలిక వసతులైన విద్యుత్, సాగునీరు, రహదారులు లాంటి రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Also Read : YS Jagan : ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్.. అసెంబ్లీ గేటు వద్ద జగన్ నిరసన
2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాద్యతను కూటమికి ప్రజలు అప్పజెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమి పాలన సాగిస్తోంది. గత 19 నెలల కాలంలో రాష్ట్రాన్ని పునర్నించి గాడిలో పెట్టింది. సూపర్ సిక్స్ సహా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రీస్టార్ట్ అయ్యాయి. తొలి 9 నెలల కాలంలో దిద్దుబాటు చర్యలు, పాలసీలు వ్యవస్థల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఏడు శ్వేత పత్రాలను విడుదల చేసి పారదర్శకమైన పాలనను కూటమి ప్రభుత్వం చేపడుతోందని, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పాలన సాగిస్తోందని, పది సూత్రాలను నిర్దేశించుకుని సుపరిపాలనను ప్రజలకు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, అభివృద్ధిని సంక్షేమం సమతూకంగా పరిపాలన సాగిస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలోకి మరికొన్ని పాయింట్లు..
♦ ప్రజా సంక్షేమం అనే కోణంలోనే ప్రతీ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది.
♦ ఏడాదికి రూ.33 వేల కోట్లతో సూపర్ సిక్స్ సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తోంది.
♦ 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రయోజనం కలిగిస్తున్నాయి.
♦ 66 లక్షల మందికిపైగా విద్యార్ధులకు తల్లికి వందనం ద్వారా ఆర్ధిక సాయం అందుతోంది.
♦ స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుతోంది.
♦ అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల చొప్పున 46.86 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతోంది
♦ దీపం 2.0 పథకం ద్వారా 1.08 కోట్ల మందికి పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం.
♦ మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు, 5757 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం పూర్తి చేసింది.
♦ మత్స్యకార సేవలో పథకం ద్వారా 1.2 లక్షల మందికి రూ.20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందుతోంది
♦ 1 లక్షమందికి పైగా హ్యాండ్లూమ్, పవర్ లూమ్‌లపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు 200, 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోం
♦ జీరో పావర్టీ లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోంది.
♦ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ప్రతీ కుటుంబానికి అవసరమైన ప్రయోజనాలను అందిస్తున్నాం
♦ త్వరలో ఫ్యామిలీ కార్డును ప్రభుత్వం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది
♦ పీ4 ద్వారా పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
♦ ఎవరూ ఆకలితో ఉండకూడదనే సూత్రంతో 113 నియోజకవర్గాల్లో 205 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది
♦ త్వరలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ గ్రామీణ అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది
♦ అందరికీ గృహాలు అనే లక్ష్యంతో గృహనిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది
♦ ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకూ న్యాయం జరిగేలా చేసింది
♦ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది
♦ బీసీల అభ్యున్నతికి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది
♦ ఎంస్ఎంఈల ద్వారా బీసీ వర్గాలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది
♦ మైనారిటీలకు భద్రత, వారికి అభివృద్ధిలో భాగస్వామ్యం, విద్య, ఆర్ధిక సహకారంతో మేలు చేకూరుస్తోంది
♦ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చెప్పారు.
