×
Ad

AP Govt : ఏపీలోని పేదలకు ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం.. పూర్తిగా ఉచితం, వెంటనే దరఖాస్తు చేసుకోండి

AP Govt : ఏపీ ప్రభుత్వం పేదలకు మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. ఈ ఏడాది డిసెంబరు 31వరకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

chandrababu naidu

  • ఏపీలో పేదలకు అద్భుతమైన అవకాశం
  • ప్రభుత్వ భూముల్లో ఇళ్లు క్రమబద్దీకరణ
  • అభ్యంతరం లేని భూముల్లోవి మాత్రమే

AP Govt : ఏపీ ప్రభుత్వం పేదలకు మరో అద్భుతమైన అవకాశం కల్పించింది. అభ్యంతరంలేని ప్రభుత్వ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇంటి స్థలాలను క్రబద్దీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read : AP Govt : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ రంగాల్లోని ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.5వేలు పెంపు

గత ఏడాది ఇంటి స్థలాల క్రమబద్దీకరణ జీవో నెం.30 ద్వారా ఏడాది పాటు అమలు చేశారు. అయితే, చాలా మంది పేదలు దరఖాస్తు చేసుకోలేదు. కారణం ఏమిటంటే ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవటం, ఇంకా ఇతర భయాలతో దరఖాస్తు ప్రక్రియకు దూరంగా ఉన్నారు. అయితే, 2025 డిసెంబర్‌తో ఈ స్కీం గడువు ముగిసిపోయింది. అయితే, కొత్త ఏడాది కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతేడాది డిసెంబర్ నెలతో ఇంటి స్థలాలను క్రమబద్దీకరించే పథకం గడువు ముగియడంతో.. కొత్త ఏడాది కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని, క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని టీటీడీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరారు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలాల క్రమబద్దీకరణ స్కీమ్ ను మరోసారి అమల్లోకి తీసుకొస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు (జీవో నెం.115) జారీ చేశారు.

తాజా ఉత్తర్వులు ప్రకారం.. ఈ ఏడాది డిసెంబరు 31వరకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అంటే, అభ్యంతరలేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు, ఇంకా పూరిపాకలు, తాత్కాలిక షెడ్ లు వేసుకుని నివసిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే, చెవులు, కుంటలు, కాలువ, చెరువు పోరంబోకు, డిఫెన్స్, ఇతర కీలకమైన ప్రభుత్వ ప్రయోజనాలతో ముడిపడిన భూముల్లో క్రమబద్దీకరణకు అవకాశం ఉండదు. నివాస యోగ్యమైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని పక్షంలోనే క్రమబద్దీకరణకు అవకాశం కల్పిస్తారు.