AP High Court : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది.
- kunduru Vinod
- Updated on- September 18, 2021 / 12:01 PM IST
Ap High Court
AP High Court : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
Read More : TTD : తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే
కాగా ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసి, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. కౌంటింగ్ ఏప్రిల్ 10న నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులలో వాయిదా పడింది. ఇక నేడు హైకోర్టు కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎస్‌ఈసీ కసరత్తు ప్రారంభించింది.
