High Court Priests : విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు బిగ్ షాక్.. వాళ్లంతా అనర్హులు.. హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ

High Court Priests : దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి విదేశీయానం చేసిన అర్చకుల ప్రవేశంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Ap High Court Key Orders On Priests Foreign Tours

  • విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు బిగ్‌షాక్
  • వారికి గర్భాలయంలో అర్చకత్వానికి అనుమతి లేదు
  • అధికారులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ

High Court Priests : విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు ఏపీ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. వారికి గర్భాలయంలో అర్చకత్వానికి అనుమతి లేదని దేవదాయ శాఖ సర్క్యులర్‌ను అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : ఏపీలో అపరిచితుడిలా వెదర్.. ఓ వైపు వడగాల్పులు.. మరోవైపు వడగళ్ల వాన.. ఈ జిల్లా వాళ్లు బీ కేర్ ఫుల్..

ఆలయ క్రతువులు, ఉత్సవాలను ఆగమ శాస్త్ర, ఆలయ సంప్రదాయాల ప్రకారం నిర్వహించాల్సి ఉందన్న దేవదాయశాఖ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి విదేశీయానం చేసిన అర్చకుల ప్రవేశంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

విదేశీయానం చేసిన అర్చకులు ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ ధార్మిక పరిషత్‌, శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ను న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 30న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

విదేశీయానం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి దైవానికి పూజాకార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి లేదంటూ దేవాదాయ శాఖ 2010 నవంబరు 10న జారీ చేసిన సర్క్యులర్, శృంగేరి శారదా పీఠం జగద్గురువులు మహాతీర్థ భారతీస్వామి 2024 డిసెంబరు 20న విడుదల చేసిన ‘ప్రామాణిక’ను అమలు చేయడం లేదంటూ విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డీఎస్‌ఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం సోమయాజి హైకోర్టులో పిటీషన్ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కేఆర్‌ శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

దేవదాయశాఖ తరఫు న్యాయవాది స్పందిస్తూ గతంలో ఇచ్చిన సర్క్యులర్, ప్రామాణికను అనుసరిస్తామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి దేవదాయశాఖ జారీ చేసిన సర్యులర్‌లోని మార్గదర్శకాలు, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం ఇచ్చిన ప్రామాణికను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.