ఏపీలో అపరిచితుడిలా వెదర్.. ఓ వైపు వడగాల్పులు.. మరోవైపు వడగళ్ల వాన.. ఈ జిల్లా వాళ్లు బీ కేర్ ఫుల్..
Rain Alert : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపారు.
Rain Alert
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్
- ఉత్తరాంధ్రలో పిడుగులతో వర్షాలు
- 17మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Rain Alert : ఏపీలోని ఒకపక్క ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండగా.. మరోపక్క అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read : AP Govt : రైతులకు గుడ్న్యూస్.. 8 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు..
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిన నేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పిడుగులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావొద్దని, పనులపై ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వచ్చే వారం రోజులు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు పడే సమయంలో, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాల వద్ద, చెట్ల కింద, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
మరోవైపు.. ఏపీలో ఎండలుసైతం దంచికొడుతున్నాయి. రోజురోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్ నివారించేందుకు లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రావణాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
