Vishwanath and Sons OTT : ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath and Sons OTT).
Do you know Suriya Vishwanath and Sons movie will come which OTT
Vishwanath and Sons OTT : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సంయుక్తంగా నిర్మించారు.
జీవి ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ నేడు (ఆగస్టు 14న) రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి చోట ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది.
Vishwanath and Sons : ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సూర్య ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?
ఇక ఈ చిత్రం ఏ ఓటీటీలోకి రానుంది అనే విషయం తెలిసిపోయింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర టైటిల్ కార్డులో వెల్లడించారు.
ఈ చిత్రం విడుదలైన నెల రోజుల తరువాతనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.
