Tirupati Special Trains: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి స్పెషల్ ట్రైన్స్.. టైమింగ్స్ ఇవే..
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(Tirupati Special Trains) సంతోషకరమైన వార్త అందించింది.
South Central Railway special trains for Tirumala devotees.
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- తిరుపతికి ప్రత్యేక రైళ్లు
- సెప్టెంబర్ వరకు రైలు సర్వీసులు
Tirupati Special Trains: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే సంతోషకరమైన వార్త అందించింది. దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో తిరుపతి రైల్వే మార్గంలో తీవ్ర రద్దీ నెలకొంటోంది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు ప్రత్యేక, వీక్లీ రైళ్ల(Tirupati Special Trains)ను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలోనే పండుగలు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-తిరుపతి మార్గంలో సరికొత్త వీకెండ్ స్పెషల్ రైలును అందుబాటులోకి తెచ్చింది.
విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైలు:
రైల్వేశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తిరుపతి-విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ (08509) ఆగస్ట్ 10 నుండి సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి ఆదివారం, గురువారాల్లో తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-తిరుపతి (08510) రైలు ఆగస్ట్ 17 నుండి సెప్టెంబర్ 11 వరకు ప్రతి సోమ, శుక్రవారాల్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 22 కోచ్‌లతో నడిచే ఈ రైలు ఏపీలోని పలు జిల్లాల ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది.
చర్లపల్లి, తమిళనాడు వేడుకలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు:
శ్రీవారి భక్తులతో పాటు ఇతర ప్రయాణికుల కోసం సంబల్పూర్-చర్లపల్లి (08309) ప్రత్యేక రైలును ఆగస్ట్ 14న నడపనున్నారు. ఇది మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. మరోవైపు తమిళనాడులోని వేళాంకణ్ణి చర్చి వార్షిక ఉత్సవాల దృష్ట్యా ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 7 వరకు పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ రైళ్లు తెలంగాణ, ఏపీల్లోని నల్లగొండ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
