ఏపీలో ఇంగ్లీషు మీడియంపై హై కోర్టు బ్రేకులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

  • Publish Date - April 15, 2020 / 08:49 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 81.85 ను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సవాల్ చేస్తూ బీజేపీ నేత సుదీష్ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్లు వేశారు.

2020, ఏప్రిల్ 15వ తేదీ బుధవారం వీటిపై హైకోర్టు విచారణ చేపట్టింది ఏ మీడియంలో చదవాలన్న అంశాన్ని విద్యార్థుల నిర్ణయానికి వదిలివేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేయడం సరికాదన్నారు.

ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల భవిష్యత్ కు ఉపయోగపడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.