Tuni Girl Missing Case : చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై అసత్య ప్రచారం ఆపండి.. హోం మంత్రి అనిత హెచ్చరిక
Tuni Girl Missing Case : చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై వెంటనే అసత్య ప్రచారాన్ని ఆపేయాలంటూ ఏపీ హోం మంత్రి అనిత గట్టిగా హెచ్చరించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.
- Sreehari A
- Published on- June 17, 2026 / 05:38 PM IST
Tuni Girl Missing Case
- జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన హోం మంత్రి అనిత
- చిన్నారి కనిపించకుండా పోవడం చాలా విచారకరం
- తుని చిన్నారి మిస్సింగ్ కేసుపై అసత్య ప్రచారం చేయొద్దు
Tuni Girl Missing Case : అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి జరుగుతున్న అసత్య ప్రచారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లను ఆమె హెచ్చరించారు.
లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇటీవలే తునిదొండవాక పంచాయతీ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి అదృశ్యమైన కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Read Also : Tesla Experience Center : వావ్.. టెస్లాకు హైదరాబాద్ ఆగయా.. ఈ ఫ్యూచర్ కారు ఇప్పుడు మన సిటీలోనే!
ఈ నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబసభ్యులను హోం మంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారి కనిపించకుండా పోవడం చాలా విచారకరమన్నారు. పాప కనిపించకపోవడంతో తల్లడిల్లుతున్న జ్ఞానేశ్వరి తల్లి బాధ వర్ణనాతీతమన్నారు. చిన్నారి అదృశ్యమైన విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు.
టెక్నికల్ ఆధారాలే కాకుండా గ్రౌండ్ లెవెల్ లో కూడా అనేక బృందాలు తీవ్రంగా జల్లెడ పడుతున్నాయని అన్నారు. పాప అదృశ్యమైన కేసులో ఏపీ ప్రభుత్వం ఎక్కడ అలసత్వం వహించలేదని, ప్రతిరోజు ఈ అంశం మీద మోనిటరింగ్ చేస్తూనే ఉన్నామని హోం మంత్రి స్పష్టం చేశారు.
పాప ఆచూకీ దొరికే వరకు పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. జ్ఞానేశ్వరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.
