Tesla Experience Center : వావ్.. హైదరాబాద్‌కు టెస్లా ఆగయా.. ఈ ఫ్యూచర్ కారు ఇప్పుడు మన సిటీలోనే!
Tesla Experience Center : దేశంలో ఐదో టెస్లా ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఓపెన్ అయింది. 2026 మోడల్ Y-మోడళ్లతో టెస్లా సర్వీసు సేల్స్ సెంటర్ ఆకర్షణీయంగా మారింది. పూర్తి వివరాలివే..
Tesla Experience Center
- దేశంలో టెస్లా ఐదో ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- హైదరాబాద్ వేదికగా కొత్త టెస్లా మెగా సర్వీసు సెంటర్
- టెస్లా కొత్త వై ప్రీమియం మోడల్ కార్లు అందుబాటులోకి
Tesla Experience Center : దేశంలోకి మరో టెస్లా కొత్త ఎక్స్పీరియన్ సెంటర్ వచ్చేసింది.. ఎక్కడో కాదు.. మన హైదరాబాద్ నగరానికే.. హైటెక్ సిటీ సమీపంలోని నాలెడ్జ్ సిటీలో ఈ టెస్లా ఎక్స్పీరియన్ సెంటర్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఎలన్ మస్క్‌కు చెందిన అమెరికా ఈవీ దిగ్గజం హైదరాబాద్‌లో సేల్స్, సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు దేశంలో టెస్లాకు 4 సేల్స్ షోరూమ్‌లు మాత్రమే ఉన్నాయి.
లేటెస్ట్గా ఐదో టెస్లా సర్వీసు సెంటర్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఈ కొత్త సెంటర్లో 2026 మోడల్ Y-మోడళ్లతో టెస్లా (Tesla Experience Center) మరింతగా విస్తరిస్తోంది. టెస్లా కార్ల కోసం ఎదురుచూసే కస్టమర్లు జూన్ 17 నుంచి సెంటర్లో కొత్త మోడల్ వై ప్రీమియం, రియర్ వీల్ డ్రైవ్, మోడల్ వైఎల్ కార్లను చూడొచ్చు.
సందర్శకుల కోసం గైడెడ్ వాక్ అరౌండ్, ప్రొడక్టు ఎక్స్ పీరియన్స్ వంటివి టెస్లా సలహాదారుల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, డిజైన్ ఫిలాసఫీ, అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహన టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు, పర్ఫార్మెన్స్ సామర్థ్యాలను కూడా అడిగి తెలుసుకోవచ్చు. ప్రత్యేకించి నగర యూజర్లకు ఈజీగా డైరెక్ట్-టు-కన్స్యూమర్ ఎక్స్ పీరియన్స్ కోసం టెస్లా తెలంగాణలోని బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో డెలివరీ, సేల్స్ వంటి సేవలను కూడా అందించనుంది.
ఈ టెస్లా ఎక్స్ పీరియన్స్ సెంటర్లో 2026 మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ 2,138 లీటర్ల స్టోరేజ్ స్థలాన్ని అందిస్తుంది. ఐదుగురు ప్రయాణీకుల వరకు మల్టీఫేస్ సీట్లు, తగినంత లగేజీ సామర్థ్యం, పవర్-ఫోల్డింగ్ సీట్లను అందిస్తుంది. అల్ట్రా-రెస్పాన్సివ్ మోటార్లతో రన్ అవుతుంది.
టాప్ స్పీడ్ 500కి.మీ రేంజ్ :
కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 500 కిలోమీటర్ల (WLTP) వరకు రేంజ్ అందిస్తుంది. టెస్లా మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ దేశంలో రూ. 50,89,000 వద్ద లభిస్తుంది. డౌన్ పేమెంట్ ద్వారా రూ.6 లక్షలు, నెలవారీ ఈఎమ్ఐ రూ. 39,990 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఒకసారి బుకింగ్ చేశాక డెలివరీలు జూలై 2026లో ప్రారంభమవుతాయి.
3 వరుసలు.. 6 సీట్లు.. ఫ్యామిలీకి బెస్ట్ :
ఈ టెస్లా సెంటర్ వద్ద మోడల్ వైఎల్ కూడా కంపెనీ ప్రదర్శిస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ ఎస్ యూవీ అల్టిమేట్ ఫ్యామిలీ వాహనంగా రూపొందింది. ఇందులో మూడువరుసలతో 6 సీట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. డ్రైవర్, ప్రయాణీకులకు హెడ్ రూమ్, లెగ్ రూమ్, సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. కేవలం 5.0 సెకన్లలో గంటకు 0–100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
డౌన్ పేమెంట్, నెలకు ఈఎంఐ ఎంతంటే? :
మోడల్ వైఎల్ ప్రారంభ ధర రూ. 61,99,000 వద్ద లభిస్తుంది. డౌన్ పేమెంట్ కోసం రూ.6,50,000, నెలవారీ ఈఎంఐ రూ. 49,990 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు టెస్లా మోడళ్లు NHTSA, IIHS (యునైటెడ్ స్టేట్స్), యూరో NCAP (యూరప్), ANCAP (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్), C-IASI (చైనా)తో సహా ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంస్థల నుంచి టాప్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. భద్రత, సామర్థ్యం, పర్ఫార్మెన్స్, అడ్వాన్స్ టెక్నాలజీతో అందుబాటులోకి రానున్నాయి.
మోడల్ వై, ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్, మోడల్ వైఎల్ రెండూ ఇప్పుడు టెస్లా అధికారిక వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో హోమ్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది. 30 జూన్ 2026 లోపు ఆర్డర్ చేసిన కస్టమర్లకు ఫ్రీ వాల్ కనెక్టర్ కూడా అందుతుంది. మోడల్ వైఎల్ షెడ్యూల్ టెస్ట్ డ్రైవ్ సంబంధించి మరిన్ని వివరాల కోసం టెస్లా అధికారిక వెబ్ సైట్ విజిట్ చేయొచ్చు.
