AP Inter Results 2026 : నేడు ఏపీలో ఇంటర్ ఫలితాలు.. సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి.. వాట్సాప్ ద్వారా కూడా.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ
AP Inter Results 2026 : ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి.
- Harishth Thanniru
- Updated on- April 15, 2026 / 07:58 AM IST
AP Inter Results 2026
- నేడు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
- విడుదల చేయనున్న మంత్రి నారా లోకేశ్
- వాట్సప్ ద్వారానూ ఫలితాలు చూసుకోవచ్చు..
AP Inter Results 2026 : ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. బుధవారం ఉదయం 10.31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. ఫలితాలు bie.ap.gov.in, resultsbie.ap.gov.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి.
Also Read : Mandipalli Ramprasad Reddy: ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే, మంత్రి కూడా.. అప్పుడే పొలిటికల్ ఫ్యూచర్‌పై బెంగ.. ఎందుకు?
ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా.. 10.57లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 5.31లక్షల మంది మొదటి సంవత్సరంలో.. 5.26లక్షల మంది సెకెండియర్ విద్యార్థులు ఉన్నారు. ఇదిలాఉంటే.. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా అదనంగా ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టు మార్కులను జాబితాలో విడిగా ఇస్తారు.
తొలుత ఏప్రిల్ 21లోగా ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనాన్ని హుటాహుటీన పూర్తి చేశారు. మార్కుల ప్రాసెస్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తిచేసిన విద్యాశాఖ ముందుగా నిర్ణయించిన సమయం కంటే ఇంకాస్త ముందుగానే అంటే.. ఏప్రిల్ 15వ తేదీన ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణల వల్ల పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టింది. ఈ కారణంగానే మూల్యాంకనంలో కాస్త జాప్యం నెలకొందని తెలుస్తోంది.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..
♦ ముందుగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ను సందర్శించాలి.
♦ హోమ్ పేజీలో ‘First Year Results’ లేదా ‘Second Year Results’ అనే ఆప్షన్లపై క్లిక్ చేయాలి.
♦ మీ హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి.
♦ వెంటనే మీ రిజల్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
♦ దీనిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
వాట్సాప్ (WhatsApp) ద్వారా ఇలా..
♦ ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 కు వెళ్లాలి.
♦ ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయాలి.
♦ మెనూ డిస్‌ప్లే అవుతుంది.
♦ మెనూలో సెలక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
♦ అనంతరం విద్యా సేవలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
♦ ఆ తరువాత ఏపీ ఇంటర్ పలితాలు 2026 ఎంచుకోవాలి.
♦ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
♦ మీ ఫలితాలు మీకు వాట్సప్ లోనే వచ్చేస్తాయి
