Mandipalli Ramprasad Reddy: ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే, మంత్రి కూడా.. అప్పుడే పొలిటికల్ ఫ్యూచర్‌పై బెంగ.. ఎందుకు?
ఓ వైపు రాయచోటి జిల్లా కేంద్రం మారడంతో..లోకల్‌గా టీడీపీపై ప్రజల్లో కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుందట. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేందుకు వైసీపీ చేయని ప్రయత్నాలు లేవంటున్నారు. అయితే జిల్లా కేంద్రం మార్పు అప్పుడు మండిపల్లి కంటతడి పెట్టి..చేయాల్సినంత హడావుడి చేశారు.
- పొలిటికల్ ఫ్యూచర్‌పై మంత్రి రాముడి రాగం..!
- పార్టీపై, పార్టీలో తన ప్రాధాన్యతపై ఆందోళన.!
- పురపోరులో పోటీ చేసే అభ్యర్థులే లేరన్న మండిపల్లి..
- జిల్లా కేంద్రం మార్పు..సుగవాసితో గ్యాప్..ఆందోళన అందుకేనా?
- వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ఫిక్స్ అయిపోయారా?
Mandipalli Ramprasad Reddy: ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. మొదటిసారి శాసనసభలో అడుగు పెట్టడమే కాదు..అమాత్య యోగం కూడా దక్కింది. రెండేళ్ల టర్మ్ పూర్తి కావొస్తోంది. కానీ అంతలోనే ఆయనకు పొలిటికల్ ఫ్యూచర్‌పై బెంగ పట్టుకుందట. ఉన్నట్లుండి..సొంత పార్టీపై, పార్టీలో తన ప్రయారిటీపై మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా మారాయి. స్థానిక పోరు వేళ పార్టీ సిచ్యువేషన్..రాబోయే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వంపై ఆయన ఆందోళన చెందడానికి రీజనేంటి? మినిస్టర్‌గా ఉండి..పోటీ చేసే అభ్యర్థులు లేరంటూ ఎందుకు కామెంట్స్ చేసినట్లు?
మరో ఆరు నెలల్లో లోకల్ బాడీ పోల్స్ రాబోతున్నాయి. సీఎం చంద్రబాబు కామెంట్స్..స్టేట్ ఈసీ డెవలప్మెంట్స్తో..రాష్ట్రంలో టీడీపీ లీడర్లు అలర్ట్ అయ్యారు. కానీ ఓ నియోజకవర్గంలో మాత్రం మంత్రికి, పార్లమెంట్ అధ్యక్షునికి మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌తో..సీన్ మరోలా ఉందట. రాయలసీమలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిన రాయచోటి నియోజకవర్గంలో..మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్టు కోసం ఆరాటపడుతున్నారట. కానీ సొంత నియోజకవర్గంలోనే ఆధిపత్య పోరుకు తెరలేపినట్టు ఫీల్ అవుతున్నారట. రాయచోటి నియోజకవర్గానికి చెందిన సుగవాసి ప్రసాద్‌బాబును రాజంపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచి మండిపల్లిలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోందట.
ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గ లీడర్లు కావడంతో పాటు..వీళ్లిద్దరి కుటుంబాల మధ్య ఎప్పటినుంచో వైరం ఉండగా..తాను మంత్రిగా ఉండగా.. సుగవాసికి అధ్యక్ష పగ్గాలు అప్పగించడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారట మండిపల్లి. తనకు చెక్ పెట్టేందుకే సుగవాసిని ఎంకరేజ్ చేస్తున్నారేమోనన్న భావనలో ఉన్నారట మంత్రిగారు. అందుకే సొంత పార్టీలో తన పొలిటికల్ ఫ్యూచర్‌పై డౌట్స్ వ్యక్తం చేస్తున్నారన్న గుసగుసలు మొదలయ్యాయి.
రాబోయే ఆరు నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు సర్కార్ రెడీ అవుతుండగా..లోకల్ ఫైట్‌పై చేతులెత్తిసినట్లు మాట్లాడారు మంత్రి మండిపల్లి. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రమంతా కూటమి గాలి వీచినా రాయచోటిలో అలా జరగలేదని చెప్పారు. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో దెబ్బతిన్నామని చెప్తూ..ఆయన పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. 89 బూతుల్లో అసలు టీడీపీకి ఓట్లే పడలేదన్న మంత్రి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సొంత పార్టీ వారే శత్రువులుగా తయారయ్యారని మనసులో మాటను బయటపెట్టారు.
టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని గెలిపించాలంటూ పిలుపు..
రాయచోటి జిల్లా కేంద్రం మార్పు తర్వాత నియోజకవర్గంలో టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని భావిస్తున్నారట రాంప్రసాద్‌రెడ్డి. అందులో భాగంగానే ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రాయచోటి మున్సిపాలిటీలో 42 వార్డులకు టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులే లేరని కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారని అంటున్నారు. పైగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని గెలిపించాలంటూ పిలుపునివ్వడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. పార్టీని బతికించాలంటూ మంత్రి మండిపల్లి ఆవేదన చెందడం వెనుక సమ్‌థింగ్ ఈజ్ దేర్ అన్న చర్చ ఊపందుకుంది.
ఓ వైపు రాయచోటి జిల్లా కేంద్రం మారడంతో..లోకల్‌గా టీడీపీపై ప్రజల్లో కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుందట. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేందుకు వైసీపీ చేయని ప్రయత్నాలు లేవంటున్నారు. అయితే జిల్లా కేంద్రం మార్పు అప్పుడు మండిపల్లి కంటతడి పెట్టి..చేయాల్సినంత హడావుడి చేశారు. అయినా జిల్లా కేంద్రం రాయచోటి నుంచి షిఫ్ట్ అయిపోయింది. దీంతో మంత్రిగా ఉండి కూడా..జిల్లా కేంద్రాన్ని నిలబెట్టలేకపోయారని..ఆయనకు కూడా ప్రజల్లో చెప్పుకోదగ్గ గొప్పగా గ్రాఫ్ లేదన్నది తెలుగు తమ్ముళ్ల మాట.
తన సీటుకు ఎర్త్ పెట్టడమని అనుమానం..
ఈ తలనొప్పే ఇలా ఉంటే..సుగవాసి ప్రసాద్‌ను పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం ఆయనకు ఏ మాత్రం మింగుడు పడట్లేదని ఇంకో చర్చ. సుగవాసిని ఎంకరేజ్ చేయడమంటేనే..తన సీటుకు ఎర్త్ పెట్టడమని అనుమానిస్తున్నారట మంత్రి మండిపల్లి. ఓ వైపు రాయచోటి జిల్లా కేంద్రం మారడంతో ప్రజల్లో అసంతృప్తి ఉండగా..మరోవైపు సుగవాసి రాకతో తన సీటుకు ఎసరు వస్తుందన్న డౌట్..మండిపల్లిలో అసంతృప్తిని బయటికి వెళ్లగక్కేలా చేశాయన్న టాక్ నడుస్తోంది. అందుకే తనకు టికెట్ వచ్చినా రాకున్నా పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారన్న గుసగుసలు మొదలయ్యాయి. తనకు టికెట్ రాదేమోనన్న డౌట్ మండిపల్లి మాటల్లో స్పష్టంగా అర్థమవుతోందని అంటున్నారు. సుగవాసి ప్రసాద్ బాబును ఉద్దేశించే రాబోయే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వంపై మండిపల్లి సంచలన వ్యాఖ్యలు చేసినట్లు చర్చ నడుస్తోంది. మంత్రి రాముడి ఆందోళనకు చంద్రబాబు ఎలా ఎండ్‌కార్డ్ వేస్తారో చూడాలి.
