AP Inter Results 2026 : ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఫలితాల వెల్లడి ఆరోజే.. క్లారిటీ వచ్చేసింది..

AP Inter Results 2026 : ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఏపీ విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

AP Inter Results 2026

  • ఏపీలో ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డేట్
  • ఈనెల మూడో వారం చివరిలో ఫలితాలు వెల్లడి
  • ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు

AP Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీలోని ఇంటర్ ఫలితాలపైనే ఉంది. అయితే, ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేస్తూ ఏపీ విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

Also Read: నేడే ఇంటర్ ఫలితాలు.. వాట్సాప్‌లో ఇలా చెక్ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్ ఫుల్ డీటెయిల్స్..

ఏపీలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమైన పబ్లిక్ పరీక్షలు మార్చి 23వ తేదీ వరకు కొనసాగాయి. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టింది. అయితే, పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షల ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ ఫలితాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 18వ తేదీ లేదా 19వ తేదీన విడుదల చేయాలని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. ఫలితాల విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు.

ఈ నెల 18వ తేదీనే ఎక్కువశాతం ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు ఫలితాలపై అధికారికంగా ప్రకటన చేయనుంది.