AP Inter Supplementary Dates 2026: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ ఎప్పుడంటే..

AP Inter Supplementary Dates 2026 : ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. కాగా.. ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించింది.

AP Inter Supplementary Exam Dates 2026

AP Inter Supplementary Dates 2026: ఏపీ ప్రభుత్వం ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ప్రకటించింది. బుధవారం ఉదయం 10.31గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 77 శాతం ఉత్తీర్ణత, సెకండ్‌ ఇయర్‌లో 81 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Also Read : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఏ జిల్లా ఫస్ట్.. ఏ జిల్లా లాస్ట్ అంటే.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయని పేర్కొంది. పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి. అదేవిధంగా.. ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతాయని తెలిపింది.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం..

ఏపీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తమ జవాబు పత్రాల రీకౌంటింగ్ (RC), అలాగే స్కాన్డ్ కాపీతో కూడిన రీ వెరిఫికేషన్ (RV) కోసం ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. ఎగ్జామ్ పేపర్లు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు ఈ తేదీల్లోగా తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సి ఉంటుంది.