AP Inter Result 2023 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల, ఇక్కడ చెక్ చేసుకోండి

AP Inter Result 2023 : ఇంటర్ ఫస్టియర్ లో 56,767 మంది పాస్ అయ్యారు. 37.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

AP Inter Supplementary Result 2023 : ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళవారం సాయంత్రం 5గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఎంవి. శేషగిరిరావు ఈ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్, సెకండియర్ రెగులర్, వృత్తి విద్య(ఒకేషనల్) కోర్సులకు సంబంధించిన సప్లిమెంటరీ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.

ఇంటర్ ఫస్టియర్ లో 56,767 మంది పాస్ అయ్యారు. 37.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ సెకండియర్ లో 42,931 మంది పరీక్ష పాస్ అయ్యారు. 42.36 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ ఫస్టియర్ లో బాలురు 74 శాతం, బాలికలు 80.56 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ బాలుర ఉత్తీర్ణత‌ శాతం 81.99 శాతం, బాలికలు 86.46 శాతంగా ఉంది.

Also Read..AP Government : ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో.. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచేందుకు మార్గదర్శకాలు జారీ

ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ లో వెస్ట్ గోదావరి జిల్లా 97.32 శాతం ఉత్తీర్ణతతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 75.95 శాతం ఉత్తీర్ణతతో కడప ఆఖరి స్థానంలో నిలిచింది. వెరిఫికేషన్ కు జూన్ 23 ఆఖరు తేదీ. ఏపీలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్‌ 1 వరకు జరిగాయి. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం ఈ పరీక్షలు రాశారు. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ కలిపి మొత్తం సుమారు 4లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

ఫలితాలు చెక్‌ చేసుకోవడానికి వెబ్‌సైట్లు:
https://resultsbie.ap.gov.in/
http://www.manabadi.co.in/
https://bieap.apcfss.in/

Also Read..Andhra Pradesh : విద్యార్థులకు అలర్ట్.. స్కూల్ సమయాల్లో మార్పు, కొత్త టైమింగ్స్ ఇవే

ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలకు దాదాపు 10లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో 4,84,197 ఫస్టియర్ స్టూడెంట్స్.. కాగా.. 5,19,793 మంది సెకండియర్ స్టూడెంట్స్ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 5,38,327 మంది ఇటీవల విడుదలై ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెగులర్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించారు.