Andhrapradesh : ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. రాత పరీక్షలేదు.. ఖాళీల వివరాలివే..

Andhrapradesh : ఏపీలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

Notification released for 299 teaching posts in AP KGBVs

  • ఏపీలోని మహిళలకు శుభవార్త
  • కేజీబీవీల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..
  • మొత్తం 299 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 5

Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కేజీబీవీ (KGBV) ల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టుల (299 teaching posts)భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అందజేయాలని సూచించింది.

Also Read : Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములతో కూడిన వర్షాలు.. హెచ్చరికలు జారీ

299 పోస్టులకుగాను తాత్కాలిక ప్రాతిపదికన 2026-27 సంవత్సరానికి మాత్రమే చేపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.

మొత్తం 299 పోస్టులకుగాను ప్రిన్సిపల్ పోస్టులు 16 (వేతనం రూ.34,139), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) 98 పోస్టులు (వేతనం రూ.26,759), సీఆర్‌టీ పోస్టులు 133 (వేతనం రూ. 26,759), పీఈటీ పోస్టులు 52 (వేతనం రూ.26,759) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించి వయో పరిమితి, విద్యార్హతలు, తదితర వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చునని అధికారులు సూచించారు.

ఈ పోస్టులకోసం దరఖాస్తు చేసుకునేందుకు మే 27వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు అవకాశం ఉంది. మహిళా అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి రాత పరీక్ష లేదు. మెరిట్ ఆధారంగా ఎంపికలు చేయనున్నారు. దరఖాస్తుల్లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే 70750 39990, 79933 29115 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.