Koyye Moshenu Raju Representative Image (Image Credit To Original Source)
Koyye Moshenu Raju: ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. పలు అంశాలపై ఆయన స్పందించారు. శాసనమండలి సమావేశాలు చక్కగా జరిగాయని చెప్పారు. తాను బయాస్ గా ఉన్నానని భావించే వారిని పట్టించుకోను అని అన్నారు. వారి అభిప్రాయం వారిదే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీల రాజీనామాల ఆమోదం అంశంపైనా మండలి చైర్మన్ మోషేర్ రాజు స్పందించారు. ఎమ్మెల్సీల రాజీనామా అంశం న్యాయస్థానం పరిధి లో ఉందని స్పష్టం చేశారు.
నా పరిధి వరకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను విచారించాను అని వెల్లడించారు. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతోందన్నారు. శాసనసభ, శాసనమండలి రెండూ బాగా జరిగాయని మోషేన్ రాజు అన్నారు. చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే హక్కు అందరికీ ఉంటుందన్నారాయన. సెషన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టొచ్చని మండలి చైర్మన్ మోషేన్ రాజు పేర్కొన్నారు.
Also Read: దేశంలోని తొలిసారి.. AP ప్రభుత్వం సంచలన నిర్ణయం.. మూడో బిడ్డను కంటే రూ.25 వేలతో పాటు 18 ఏళ్ల వరకు