AP Local Body Elections 2026 : లోకల్‌ పోరులో డైరెక్ట్ ఫైట్‌.. ఎవరికి మేలు.? టీడీపీ మాస్టార్ ప్లాన్ అదేనా?

AP Local Body Elections 2026 : మేయర్, మున్సిపల్ ఛైర్మన్‌, జిల్లా, మండల పరిషత్‌ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలని కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

AP Local Body Elections 2026

AP Local Body Elections 2026 : మేయర్, మున్సిపల్ ఛైర్మన్‌, జిల్లా, మండల పరిషత్‌ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలని కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. డైరెక్ట్ ఎలక్షన్స్‌కు మొగ్గు చూపడం వెనుక ఓ వైపు కేంద్రప్రభుత్వ ఒత్తిడితో పాటు మరోవైపు సీఎం చంద్రబాబు పొలిటికల్ స్కెచ్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా..ప్రత్యక్ష ఎన్నికలతో వైసీపీకి షాక్ ఇవ్వడంతో పాటు.. పబ్లిక్ పల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్లాన్‌లో ఉన్నారట.

Also Read:  Kakinada : ఫోన్ తెచ్చిన తంటా.. కాకినాడలో కొట్టుకున్న లేడీ స్టూడెంట్స్.. వీడియో వైరల్.. సీఎం చంద్రబాబు సీరియస్

ఎంపీటీసీలు.. ఎంపీపీలను ఎన్నుకోవడం.. జడ్పీటీసీలు.. జడ్పీ ఛైర్మన్‌ను ఎన్నుకోవడం.. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఛైర్మన్‌, మేయర్‌ను ఎన్నుకోవడంతో పార్టీలు, లీడర్లకు ఎన్నో చిక్కులు చికాకులు ఇబ్బందికరంగా మారాయి. క్యాంప్ పాలిటిక్స్, అవిశ్వాసం టెన్షన్, జంపింగ్ జపాంగ్‌ల బెడద.. ఇలా పలు ఇష్యూస్‌ హెడెక్‌గా మారేవి. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో అవిశ్వాస పెట్టడానికి నాలుగేళ్ల లాకింగ్ పీరియడ్‌ పెట్టారు. అయినా పదవి దిగే ముందు జడ్పీ ఛైర్మన్, మేయర్‌ పదవుల్లో ఉన్న నేతలకు, వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు తలనొప్పులు తప్పడం లేదు. అందుకే పాత విధానంలో మేయర్, మున్సిపల్ ఛైర్మన్, ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికలను పెట్టేందుకు రెడీ అవుతోంది కూటమి సర్కార్. స్థానిక సంస్థల్లో రాజకీయ అస్థిరత లేకుండా పాలన సాఫీగా జరగాలనే ఆలోచన ఒకటైతే.. డైరెక్ట్ ఎలక్షన్స్‌కు వెళ్లడం వెనుక కూటమి సర్కార్‌ రాజకీయ వ్యూహానికి తెరలేపిందనే టాక్ వినిపిస్తోంది.

డైరెక్ట్ ఎన్నికల ద్వారా వైసీపీ దూకుడుకు ఇప్పుడే బ్రేక్ వేయాలని ప్లాన్ చేస్తోందట టీడీపీ అధినాయకత్వం. వైసీపీకి చాలా నియోజకవర్గాలలో బలమైన లీడర్లు లేరు. క్యాడర్‌ కూడా స్ట్రాంగ్‌ నిలబడే పరిస్థితి లేదు. వైసీపీ ముఖ్యనేతలు కూడా స్థానిక ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకునే సిచ్యువేషన్‌ లేదని కూటమి అంచనా వేస్తోందట. ఇదే టైమ్‌లో పరోక్ష విధానంలో ఎన్నికలకు వెళ్తే.. ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని లెక్కలు వేసుకుంటోందట. సూపర్ సిక్స్ హామీలు.. ఇంకోవైపు అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తుండటంతో ప్రజల్లో తమ ప్రభుత్వంపై సానుకూల వైఖరి ఉందనే ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్నారట.

ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా వైసీపీ ఒకటో రెండో సీట్లు గెలిచినా.. మిగతా చోట్ల కూటమికే ప్రజలు పట్టం కడుతారని అనుకుంటున్నారట. అన్నింటికి మించి అర్బన్‌ ఏరియాల్లో తమకు మంచి పట్టుందని.. ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉందని బిలీవ్ చేస్తున్నారట కూటమి పెద్దలు. అందుకే మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో జరిగితే.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా విజయాన్ని సొంతం చేసుకోవచ్చని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారట. ఇక పరోక్ష ఎన్నికలతో ప్రతీ రెండేళ్లకు మేయర్, చైర్మన్లను మార్చాలనే డిమాండ్లు కూడా కూటమి పార్టీల నుంచి డిమాండ్లు వ్యక్తమయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రత్యక్ష పోరుతో సీట్ల పంపకంతోనే వివాదం ముగుస్తుందని నెక్స్ట్‌ ఫైవ్‌ ఇయర్స్ ఏ గొడవ ఉండదనేది కూటమి పెద్దల ఆలోచనగా చెబుతున్నారు.

ముందుగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చైర్మన్‌, మేయర్ల ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ఎన్నుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంపైనా రకరకాల ఎనాలిసిస్‌లు జరుగుతున్నాయి. డైరెక్ట్‌ పోరు విపక్షం వైసీపీకి కొంత అనుకూలంగా మారే ఛాన్సెస్ ఉన్నాయన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మామూలుగా అయితే స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అడ్వాంటేజ్‌గా ఉండటం చూస్తూనే ఉన్నామ్. కానీ ప్రత్యక్ష ఎన్నికలతో అభ్యర్థి బలాబలాలు, క్యాస్ట్ ఈక్వేషన్‌లు.. ప్రాంతాలను ఉన్న సెంటిమెంట్లు.. వైసీపీకి కాస్త ఆశ కలిగించే అంశాలని అంటున్నారు. బలమైన రాజకీయ నేపథ్యం, ప్రజలతో సత్సంబంధాలు ఉన్న లీడర్లే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యక్ష ఎన్నికలను విపక్షం ఎలా తమకు అనుకూలంగా మల్చుకుంటుందనే అంశంపైనే ఆ పార్టీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉండనున్నాయి.

రాష్ట్రంలో 17 మేయర్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీల్లో ఛైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపితే 2029 ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందనే వైసీపీ ప్లాన్‌గా తెలుస్తోంది. తమకు క్యాడర్, లీడర్లు బలంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యూహాత్మకంగా పనిచేసి విజయం సాధించేందుకు పావులు కదుపుతోందట వైసీపీ. మొత్తానికి ప్రత్యక్ష ఎన్నికలతో తమకు మేలంటే తమకే లాభమని అటు టీడీపీ ఇటు వైసీపీ ఎవరి ధీమాలో వారున్నారు. ఎన్నికలు జరిగితే డైరెక్ట్ పోరు ఎవరికి మేలు చేసిందో స్పష్టత రానుంది.