Janasena Party : జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 14 స్థానాలకు పేర్లు ఖరారు..
AP Local Body Elections : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ రెండు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
- Harish Thanniru
- Published on- October 17, 2026 / 12:40 PM IST
Janasena Party
Janasena Party : ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాకు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. తొలి విడతలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 12 మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
కార్పొరేషన్లు..
కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు మొత్తం నాలుగు కార్పొరేషన్ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. తొలి జాబితాలో రెండు స్థానాలకు ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.
ఏలూరు : రెడ్డి అప్పలనాయుడు
విజయవాడ : వంగవీటి రాధాకృష్ణ
మున్సిపాలిటీలు ..
కూటమి పొత్తుల్లో బాగంగా జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. తొలి జాబితాలో 12 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.
1. అమలాపురం : నల్లా శ్రీధర్
2. చిలకలూరిపేట : తోట రాజరాజేశ్వరి
3. గొల్లప్రోలు : కడారి తమ్మయ్య నాయుడు
4. నరసాపురం : కొత్తపల్లి శైలజ
5. నిడదవోలు : కల్లం జ్యోతి
6. పెడన : మట్టా శివపావని
7. పిఠాపురం : డాక్టర్ బీరా విజయ్ శేఖర్
8. పుత్తూరు : డి. ఏలుమలై
9. సాలూరు : గొర్లె విజయకుమారి
10. సామర్లకోట : పిట్టా జానకి రామారావు
11. తెనాలి : తోటకూర వెంకట రమణారావు
12. తిరువూరు : పి. మాధవి
