GST Council : విభజన చట్టం, పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తాం – ఏపీ మంత్రి బుగ్గన

. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్స్‌టైల్స్‌ రంగంపై జీఎస్టీ శాతం పెంపు వాయిదా....

AP Minister Buggana Rajendranath : జనవరి 12న జరిగే హోంశాఖ కార్యదర్శి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలను ప్రస్తావిస్తామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశంలో విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్రం హోంశాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో మాట్లాడుతామని తెలిపారు. వచ్చే బడ్జెట్ లో దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజీ ఇవ్వాలని.. నడికుడి- శ్రీకాళహస్తి, కడప – బెంగుళూర్ రైల్వే, కోటిపల్లి, రాయదుర్గం లైన్లతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు.

Read More :Movie Tickets: తెలంగాణలో సినిమాలు చూడం.. టిక్కెట్ల ధరలపై ప్రేక్షకులు ఆగ్రహం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ఢిల్లీలో 2021, డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం జీఎస్టీ మండలి 46వ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్స్‌టైల్స్‌ రంగంపై జీఎస్టీ శాతం పెంపు వాయిదా వేసింది మండలి. ముందుగా 5శాతం నుంచి 12శాతానికి పెంచాలని కేంద్రం భావించగా… అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనలను తాజాగా GST కౌన్సిల్ పక్కన పెట్టింది దీంతో మండలి నిర్ణయంతో రేపటి నుంచి అమల్లోకి రావాల్సిన పెంపు వాయిదా పడింది. ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Read More : Food Delivery: ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీలపై బాదుడే.. రేపటి నుంచే!

రాష్ట్రంలో కాటన్ వస్త్రాల వాడకం ఉందని, చేనేత కార్మికులను ఆదుకోవాలని సీఎం జగన్ కోరినట్లు తెలిపారు. చేనేత కార్మికులకు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదని,
ఈ రంగం మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారనే విషయాన్ని చెప్పారన్నారు. ఈ క్రమంలో చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఈ వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న ఐదు శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి బుగ్గన తెలిపారు. ఈమొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయించడం  జరిగిందన్నారు. పోలవరంపై సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని ప్రీ బడ్జెట్ మీటింగ్ లో విజ్ఞప్తి చేసినట్లు, కొత్త భూసేకరణ చట్టం వల్ల ఈ ప్రాజెక్టు ఖర్చు పెరిగిందన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు