బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్.. : మంత్రి లోకేశ్

విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర మీకు లేదంటూ జగన్ మోహన్ రెడ్డిపై లోకేశ్ విమర్శలు గుప్పించారు.

Nara lokesh

Minister Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేశ్ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా జగన్ అంటూ ప్రశ్నించారు. బుదర రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్ధంపర్దం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ లోకేశ్ మండిపడ్డారు. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన జగన్.. బెంగళూరు ప్యాలస్ లో రిలాక్స్ అవుతున్నాడు. 74ఏళ్ల వయస్సులో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయ్యడానికి మనస్సు ఎలా వచ్చింది జగన్ అంటూ లోకేశ్ ప్రశ్నించారు.

Also Read : ACA President : ఏసీఏ అధ్య‌క్షుడిగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఏకగ్రీవ ఎన్నిక.. తొలి నిర్ణయంగా అదే..

విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర మీకు లేదు.. పైగా మీరు ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందే అంటూ జగన్ పై లోకేశ్ విమర్శలు చేశారు. నాడు చంద్రబాబు బుడమేరు ఆధునీకరణకు రూ.464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే వైసీపీ హయాంలో రివర్స్ పాలనలో పనులు నిలిపి ఇప్పుడు విపత్తుకు ప్రధాన కారణం అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్.
ఆధునీకరణ, మరమ్మతు పనులు ఆపేశారు. సుమారుగా రూ. 500 కోట్లు విలువైన 600 ఎకరాలు వైసీపీ నాయకులు కబ్జా చేశారని లోకేశ్ ఆరోపించారు.

Also Read : వరద సహాయంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం

2022 లోనే గండి పడినా అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఐదేళ్ళలో సరైన నిర్వహణ లేదు. విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారు. మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలకు కారణమని జగన్ పై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సమస్యలను అధిగమిస్తాం. చివరి వరద బాధితుడికి సాయం అందించే వరకూ విశ్రమించం అని లోకేశ్ అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు