AP NEET Students : రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెన్సార్.. ఏపీ నిట్ విద్యార్ధుల ఘనత!

తాడేపల్లిగూడెం ఏపీ నిట్ చెందిన విధ్యార్ధులు మరో ఘనత దక్కించుకున్నారు. కొత్త ఆలోచనలకు నిత్యం పదును పెట్టే విద్యార్ధులు తాజాగా సరికొత్త ఆలోచన చేశారు. వర్షపు నీటిని సమర్ధవంతంగా వినియోగించుకునేలా వైఫై ద్వారా కంట్రోల్ చేసేలా ఓ సెన్సార్ పరికరాన్ని రూపొందించారు.

Rain Water Harvesting Sensor : తాడేపల్లిగూడెం ఏపీ నిట్ చెందిన విధ్యార్ధులు మరో ఘనత దక్కించుకున్నారు. కొత్త ఆలోచనలకు నిత్యం పదును పెట్టే విద్యార్ధులు తాజాగా సరికొత్త ఆలోచన చేశారు. నాలుగో సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్ధులు శిరీష్, శుక్లా, మనీష్ రాయ్, రిత్విక సోనావేన్, ఆర్తి సర్తేప్, ప్రణవ్, శుభం కుమార్, రమేష్ జైన్ కలసి తక్కువ ఖర్చుతో వర్షపు నీటిని సమర్ధవంతంగా వినియోగించుకునేలా వైఫై ద్వారా కంట్రోల్ చేసేలా ఓ సెన్సార్ పరికరాన్ని రూపొందించారు.

దీనికి చిన్న మార్పులు చేసేందుకు బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ మేనేజ్ మెంట్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో దీనిని మార్కెట్ లోకి తీసుకురానున్నారు.

ఈ ప్రాజెక్టును రూపొందించినందుకు విద్యార్ధులను నిట్ అద్యాపక బృందం అభినందించింది. ఇండియా ఇన్నోవేటివ్ ఛాలెంజ్ డిజైన్ , డిపార్ట్ మెంట్ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆప్ ఇండియా నిర్వహించిన సంయుక్త పోటీల్లో ఎంపికైన వాటిలో ఈ ప్రాజెక్టు కూడా గుర్తింపు లభించింది.

ట్రెండింగ్ వార్తలు