Rahul Gandhi – Ys Sharmila: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ.. ఆ సీటు కోసమేనా?
రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంతో పాటు వివిధ అంశాలపై రాహుల్ గాంధీ పలు సూచనలు చేసినట్లు ఎక్స్ లో తెలిపారు షర్మిల.
- Naveen
- Updated on- May 29, 2026 / 05:28 PM IST
Rahul Gandhi – Ys Sharmila: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం పాల్గొన్నారు. షర్మిల రాహుల్ తో భేటీ కావడం కాంగ్రెస్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. షర్మిల కర్నాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలో అక్కడ రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంతో పాటు వివిధ అంశాలపై రాహుల్ గాంధీ పలు సూచనలు చేసినట్లు ఎక్స్ లో తెలిపారు షర్మిల.
రాహుల్ గాంధీతో భేటీ గురించి షర్మిల ఎక్స్ లో స్పందించారు. AICC అగ్రనాయకులు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో నేడు కలవడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మీద, అలాగే పలు అంశాలపై చర్చించామని వెల్లడించారు. రాహుల్ గాంధీ నుంచి పలు సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు.
Also Read: కాంగ్రెస్ అగ్రనేతలతో సిద్ధరామయ్య భేటీ.. డిమాండ్స్ ఇవే.. కొడుకు కోసమే పట్టు..! ఈ శాఖలపైనే గురి
AICC అగ్రనాయకులు, లోక్‌సభ
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని @RahulGandhi ఢిల్లీలోని 10 జనపథ్ నివాసంలో నేడు కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ @INC_Andhra బలోపేతం మీద వివిధ అంశాలపై చర్చించి, రాహుల్ గాంధీ గారి నుంచి పలు సూచనలు తీసుకోవడం జరిగింది. pic.twitter.com/sBjj3xK4r1— YS Sharmila (@realyssharmila) May 29, 2026
