Andhra Pradesh Police : ఏపీ రాష్ట్రంలో ప్రజల మేలు కోసం సీఎం జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా మహిళల రక్షణ కోసం తగన చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా భారతదేశంలోనే మొదటిసారిగా ఓ యాప్ ను తీసుకొచ్చింది.
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ రూపొందించిన పోలీస్ సేవ యాప్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా 87 రకాల సేవలు పొందనున్నారు.
పోలీస్ సేవ ద్వారా..వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేసుల దర్యాప్తు, పురోగతి, ఎఫ్ఐఆర్ లు, రికవరీలు వివరాలు పొందే అవకాశం ఉంది. పోలీస్ సేవ యాప్ ద్వారా ఎన్ వోసీలు, లైసెన్స్ లు, పాస్ పోర్టు సేవలు కూడా పొందనున్నారు.
ఈ మొబైల్ యాప్ ద్వారా పీఎస్ అన్ని రకాల సేవలు అందుబాటులో.
అన్ని రకాల నేరాలపై ఈ యాప్ లో ఫిర్యాదులు చేసే అవకాశం.
ఫిర్యాదులకు రశీదు కూడా పొందే విధంగా యాప్ రూపకల్పన.
మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్
అత్యవసర సమయంలో వీడియో కాల్ చేసే అవకాశం.
పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనుంది.