AP Rain Alert : ఏపీలో కమ్ముకొస్తున్న కారు మబ్బులు.. నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. అలర్ట్ జారీ..

AP Rain Alert : ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

AP Rain Alert

  • ఏపీలో వర్షాల హెచ్చరిక
  • నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

AP Rain Alert : ఏపీలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉండడంతో రానున్నరోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read ; Tungabhadra Dam : రైతుల కోసం ముగ్గురు సీఎంలు ఏకమై.. తుంగభద్రకు మళ్లీ వైభవం!

శుక్రవారం ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అ వకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొన్నారు.

జూన్ 26, 27 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వెల్లడించింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు ఒకటి లేదా రెండు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలుకురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా, తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.