AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మారనున్న వాతావరణం.. వర్ష సూచన, ఈ జిల్లాలకు అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు

నైరుతి బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నూతనంగా అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ (AP Rain Alert)విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Andhra Pradesh Weather and Rainfall Warning by Meteorological Department

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • మన్యం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు
  • ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చెదురుమదురు జల్లులు

AP Rain Alert: నైరుతి బంగాళాఖాతంలోర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నూతనంగా అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అయితే ఈ అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై చాలా స్వల్పంగానే ఉంటుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, వర్షపాత ప్రభావిత ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Honey Trap: మరో కిలాడీ లేడీ.. డేటింగ్ యాప్‌లో మాయ.. ప్రైవేట్ వీడియోలతో రూ. 6 కోట్లు బ్లాక్‌మెయిల్

ఈ జిల్లాల్లో వర్షాలు, మన్యం, అల్లూరి ప్రాంతాలకు అలర్ట్:

అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా ఉత్తరాంధ్ర, దానిని ఆనుకుని ఉన్న మన్య ప్రాంతాల్లో వాతావరణం మారనుంది. ముఖ్యంగా ఆదివారం రోజున పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం (AP Rain Alert)నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల గంటకు సాధారణ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించారు.

ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు:

ఉత్తరాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్ష సూచన ఉన్న జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.