AP Covid Cases : ఏపీలో 20వేలకు పైగా కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు పైనే నమోదైంది. గడిచిన 24 గంటల్లో 92, 231 నమూనాలను పరీక్షించగా 20,937 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Ap Covid Cases

AP Covid Cases :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు పైనే నమోదైంది. గడిచిన 24 గంటల్లో 92, 231 నమూనాలను పరీక్షించగా 20,937 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,42,079 కి చేరింది.

గడిచిన 24 గంటల్లోల 104 మంది కరోనా సోకి మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 9,940 కి చేరినట్లు ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కి చికిత్స పొంది 20,811 మంది ఇళ్లకు తిరిగి వెళ్ళారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులు ఉన్నాయని హెల్త్ బులెటిన్ లో అధికారులు వివరించారు.

కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లోచిత్తూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది మరణించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10 మంది, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది చొప్పున,  కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం,  గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకు రాష్ట్రంలో 1,84,35,149 శాంపిల్స్ పరీక్షించారు.

Covid Cases 210521