AP Covid Update : ఏపీలో కొత్తగా 141 కోవిడ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో  గత కొద్ది  రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం   పడుతున్నాయి. నిన్న కొత్తగా 141 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,329 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర కోవ

AP Covid up date

AP Covid Update :  ఆంధ్రప్రదేశ్‌లో  గత కొద్ది  రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం   పడుతున్నాయి. నిన్న కొత్తగా 141 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,329 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర కోవిడ్ నియంత్రణా విభాగం ఈరోజు విడుదల చేసిన తాజా బులెటిన్ లో పేర్కొంది. దీంతో, రాష్ట్రంలో ఇంతవరకు 23 లక్షల 17 వేల 605 మందికి కొవిడ్ సోకగా, వారిలో 22 లక్షల 99 వేల 362 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 3,518 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కోవిడ్ వల్ల చిత్తూరులో ఒకరు, కృష్ణాజిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు కోవిడ్ సంబంధిత కారణాలతో మరణించారు. ఇంతవరకు రాష్ట్రంలో కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 14 వేల 725 కి చేరింది.

Also Read : Covid-19 Update : దేశంలో కొత్తగా 11,499 కోవిడ్ కేసులు నమోదు
వైఎస్సార్ కడప జిల్లాలో ఒక్కకేసుకూడా నమోదు కాలేదు. మరో ఐదు జిల్లాల్లో కేసులు సంఖ్య రెండంకెలకు చేరుకోలేదు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 27 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరంలో ఒక్కకోవిడ్ కేసు నమోదు అయ్యింది. నిన్నటివరకు రాష్ట్రంలో 3 కోట్ల, 30లక్షల 81 వేల 987 శాంపిల్స్ ను పరీక్షించినట్లు కోవిడ్ నియంత్రణ విభాగం తెలిపింది.

Ap Covid update