AP Corona : ఏపీకి బిగ్ రిలీఫ్.. కరోనా తగ్గుముఖం..

ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 35వేల 054 మంది నమూనాలు పరీక్షించగా 349..

Ap Corona Cases

AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 35వేల 054 మంది నమూనాలు పరీక్షించగా 349 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. కృష్ణాలో ఒకరు, నెల్లూరులో ఒకరు మరణించారు.

Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించ‌లేం.. జీవాయుధం కానేకాదు!

కరోనా నుంచి నిన్న 535 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4వేల 649 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 67 కేసులు వెలుగుచూశాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.