Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించ‌లేం.. జీవాయుధం కానేకాదు!

కరోనావైరస్ ఎక్కడ పుట్టింది? అసలు వైరస్ మూలాలు ఏంటి?  అన్నది ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉంది. అసలు ఈ కరోనా వైరస్ అనేది బయోలాజికల్ విపన్ కాదని, దీన్ని ఎవరూ సృష్టించలేదని వెల్లడించాయి.

Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించ‌లేం.. జీవాయుధం కానేకాదు!

Covid 19 Origins May Never Be Known

Covid-19 origins : కరోనావైరస్ ఎక్కడ పుట్టింది? అసలు వైరస్ మూలాలు ఏంటి?  అన్నది ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి జీవాయుధం రూపంలో ప్రయోగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు క్లారిటీ ఇచ్చాయి. అసలు ఈ కరోనా వైరస్ అనేది బయోలాజికల్ విపన్ కాదని, దీన్ని ఎవరూ సృష్టించలేదని వెల్లడించాయి. ఇంతకీ ఈ వైరస్ మనుషులకు ఎలా సోకింది? జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందా? అనేది కచ్చితంగా చెప్పలేమని తేల్చేశాయి.

వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయింది అనడానికి ఎలాంటి ఆధారలేమని అమెరికా ఏజెన్సీలు పేర్కొన్నాయి. కరోనా వైరస్ ఎక్కడ ఉద్భవించిందో గుర్తించడం సాధ్యపడదని అమెరికాకు చెందిన నేష‌న‌ల్ ఇంటెలిజెన్స్ ఆఫీసు తెలిపింది. ఆఫీస్ ఆఫ్ ద యూఎస్ డైర‌క్ట‌ర్ ఆఫ్ నేష‌న‌ల్ ఇంటెలిజెన్స్ (ODNI) ఈ అంశంపై  ఒక నివేదిక‌ను కూడా రిలీజ్ చేసింది. మ‌నుషుల్లో SARS CoV2 వైర‌స్ సోక‌డానికి .. వైర‌స్ స‌హ‌జంగా పుట్టిందైనా కావ‌చ్చు అని తెలిపింది. లేదంటే ఏదైనా ల్యాబ్ నుంచి లీకైనా అయి ఉంటుంద‌ని ODNI వెల్లడించింది.

కరోనా వైర‌స్ జంతువుల నుంచి సంక్రమించిందా? ల్యాబ్ నుంచి లీక్ అయిందా అనేది నిర్ధారించడం ఎప్పటికీ వీలుకాద‌ని ఏజెన్సీల నిపుణులు స్పష్టం చేశారు. బయోలాజికల్రూ విపన్ రూపంలో క‌రోనా వైర‌స్‌ను ప్ర‌యోగించారనే వార్తలను ఈ నివేదిక తీవ్రంగా ఖండించింది. జీవాయుధానికి వుహాన్ వైరాల‌జీ ల్యాబ్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని నివేదికలో వెల్లడించింది. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌భుత్వం 90 రోజుల క్రితం రిలీజ్ చేసిన నివేదిక ఆధారంగా విశ్లేష‌ణాత్మ‌క రిపోర్ట్‌ను రూపొందించారు. కొంద‌రు సైంటిస్టులు వైర‌స్ ల్యాబ్ నుంచి లీకైన‌ట్లు భావిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఆ వైర‌స్ స‌హ‌జంగానే వ్యాపించినట్టు అభిప్రాయపడుతున్నారు.
Read Also :  Corona Treatment : కరోనాకు సమర్థవంతమైన ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు