Corona Treatment : కరోనాకు సమర్థవంతమైన ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

కరోనా వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చినప్పటికీ చికిత్సకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతూనేవున్నాయి. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఔషధాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

Corona Treatment : కరోనాకు సమర్థవంతమైన ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

Corona

effective drug for the corona : కరోనా వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చినప్పటికీ చికిత్సకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతూనేవున్నాయి. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఔషధాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు మరో పురోగతి సాధించారు. ఇన్ ఫెక్షన్ కు కారణమయ్యే వైరస్ పునరుత్పత్తిని అణచివేసే సామర్థ్యము ఉన్న ఔషధ చికిత్సను బ్రిటన్, జర్మనీ శాస్త్రవేత్తులు గుర్తించారు.

కరోనా వైరస్ సోకినప్పుడు కణాల్లో అవి ఎలాంటి చర్యలు, ప్రభావాలను చూపుతున్నాయనే అంశంపై బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కెంట్ తో పాటు జర్మనీకి చెందిన గైథే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా పెంటోజ్ ఫాస్ఫేట్ అనే జీవక్రియా మార్గం క్రియాశీలంగా మారినప్పుడు మాత్రమే సార్స్ కోవ్-2 కణాల పునరుత్పత్తి వేగంగా జరుగుతున్నట్లు గుర్తించారు.

Corona Delta Variant : వ్యాక్సిన్ తీసుకున్నవారి ద్వారా కూడా డెల్టా వేరియట్ వ్యాప్తి

అయితే వీటిని అణచివేయడంలో బెన్ ఫో-ఆక్సిథియామిన్ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు బ్రిటన్, జర్మనీ నిపుణులు కనుగొన్నారు. తద్వారా ఇన్ ఫెక్షన్ కు గురైన కణాలు కరోనా వైరస్ కణాలను తగ్గించవచ్చని ఓ నిర్ధారణకు వచ్చారు. కరోనా చికిత్సకు సంబంధించిన తాజా అధ్యయనం మోటాబోలైట్స్ జర్నల్ లో ప్రచురితమైంది.

వైరల్ వ్యాధుల చికిత్సకు రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడమే అత్యంత ప్రధాన సమస్య కాబట్టి విభిన్న లక్ష్యాలతో వీటిపై పరిశోధనలు చేయడం ఎంతో ముఖ్యం. సమర్థవంతమైన కరోనా చికిత్స అభివృద్ధి చేయడంలో తాజా అధ్యయనం కీలక పురోగతి సాధించినట్లు యూనివర్సిటీ ఆఫ్ కెంట్ కు చెందిన ప్రొఫెసర్ మార్టిన్ మిషెలీస్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో కరోనా చికిత్సా విధానంపై మరింత పురోగతి సాధిస్తామన్నారు.