Ap Corona
AP Corona Cases Report : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఖతమైనట్టేనా? తాజాగా నమోదైన గణాంకాలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8వేల 219 కరోనా పరీక్షలు నిర్వహించగా, కేవలం 5 పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. కృష్ణా జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి, కడప, విజయనగరం జిల్లాలలో చెరో ఒక కరోనా కేసు మాత్రమే వచ్చాయి. మిగతా 9 జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. ఒక్క రోజు వ్యవధిలో మరో 37మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మరణాలేవీ సంభవించలేదు. నేటివరకు రాష్ట్రంలో 23,19,509 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,04,465 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 314 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 14వేల 730. నేటివరకు రాష్ట్రంలో 3,34,15,605 కరోనా పరీక్షలు నిర్వహించారు. క్రితం రోజు రాష్ట్రంలో 6వేల 396 కరోనా పరీక్షలు నిర్వహించగా, 29మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(AP Corona Cases Report)
#COVIDUpdates: 29/03/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,19,509 పాజిటివ్ కేసు లకు గాను
*23,04,465 మంది డిశ్చార్జ్ కాగా
*14,730 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 314#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/hmoGeZXwYd— ArogyaAndhra (@ArogyaAndhra) March 29, 2022
Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగ నిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి
సోమవారం 5.7 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,259 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మరో 35 మంది కోవిడ్ తో మృతి చెందారు. యాక్టివ్ కేసులు 15,378కి తగ్గాయి. దాంతో మొత్తం కేసుల్లో వాటి వాటా 0.04 శాతానికి చేరింది.
నిన్న మరో 1,700 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో రికవరీ రేటు 98.75 శాతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 4.30 కోట్ల మందికి కరోనా సోకగా..5.21 లక్షల మంది మరణించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటివరకు 183 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 25.9 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.(AP Covid News)
దేశంలో కొవిడ్ విజృంభించడంతో దాదాపు రెండేళ్ల క్రితం వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిలో మార్పులు, చేర్పులు చేసింది. అయితే, గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
#COVIDUpdates: As on 29th March, 2022 10:00AM
COVID Positives: 23,19,509
Discharged: 23,04,465
Deceased: 14,730
Active Cases: 314#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/X4fr4MZnOr— ArogyaAndhra (@ArogyaAndhra) March 29, 2022