AP SSC Results 2026 : ఏపీలోని 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
AP SSC Results 2026 : ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే, ఫలితాల విడుదల తేదీపై కీలక అప్డేట్ వచ్చింది.
- Harishth Thanniru
- Updated on- April 17, 2026 / 02:35 PM IST
AP SSC Results 2026
- ఏపీలో టెన్త్ విద్యార్ధులకు అలర్ట్
- పదో తరగతి ఫలితాల విడుదలపై కీలక అప్డేట్
- ఏప్రిల్ 15తో ముగిసింది మూల్యాంకనం ప్రక్రియ
AP SSC Results 2026 : ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఎక్స్ వేదికగా ఈనెల 15వ తేదీన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. అయితే, ఇప్పుడు అందరి దృష్టి పదో తరగతి ఫలితాలపై పడింది. ఈ క్రమంలో టెన్త్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ నుంచి కీలక అప్డేట్ వచ్చింది.
Also Read : Gold Price Today : బంగారం ప్రియులకు భారీ శుభవార్త.. కుప్పకూలిన ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ఏప్రిల్ 3వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 3,28,625 మంది, బాలికలు 3,12,264 మంది ఉన్నారు. సరాసరిన 99.05శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే, ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో పదో తరగతి పరీక్షల ఎగ్జామ్స్ పేపర్స్ మూల్యాంకనం ప్రక్రియ ఈనెల 15వ తేదీతో ముగిసింది. ఎస్‌వోలు, సీఎస్‌లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, మార్కులను మాన్యువుల్‌తో పాటు ట్యాబ్‌లలోనూ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్‌లను తీసుకొచ్చారు. మార్కులను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో నమోదు చేసి పొరబాట్లకు తావులేకుండా ఖచ్చితత్వం పాటించాలని ప్రభుత్వం సూచించింది.
ప్రస్తుతం మూల్యాంకనం ప్రక్రియ పూర్తయింది. మార్కుల ప్రాసెసింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అంతా సవ్యంగా జరిగితే.. మే మొదటి వారంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. గతేడాది ఏప్రిల్ 23వ తేదీన ఏపీ టెన్త్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.
