AP Govt. Employees: భజనతో కాదు బాధ్యతతో మెలుగుతాం: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

ఉద్యోగ సంఘ నేతలు రాజకీయ నేపథ్యంలో ఆలోచనలు విడనాడాలన్న సూర్యనారాయణ.. ఉద్యోగులందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

AP Govt. Employees: తరుగుదలతో కూడిన పీఆర్సీ మాకు వద్దు పెరుగుదల పీఆర్సీ కావాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఏపీలో పీఆర్సీ పెంపుపై ప్రభుత్వం ఉద్యోగుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వ్యవస్థ ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాలు పాటుపడాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీపై.. సీఎం జగన్ చెప్పింది ఒకటని చేసింది మరొకటని ఆరోపించారు. సంక్రాంతికి ముందు సీఎం జగన్ ను కలిసిన కొందరు ఉద్యోగసంఘాల నేతలు.. సంక్రాంతి తరవాత అన్నింటి మీద సానుకూల ప్రకటన వస్తుందని ఆశ పడ్డారని కానీ అది వ్యతిరేకంగా వచ్చిందంటూ సూర్యనారాయణ ఎద్దేవా చేశారు. కార్యదర్శులు, అధికారుల కమిటీ ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని..మధ్యంతర భృతిని తిరిగి వెనక్కి తీసుకోవడం దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదని సూర్యనారాయణ అన్నారు.

Also read: Tesla Car: ట్రాఫిక్ లో ఉన్నపుడు టెస్లా కారులో పోర్న్ చూస్తున్న “ఘనుడు”

ఉద్యోగ సంఘ నేతలు రాజకీయ నేపథ్యంలో ఆలోచనలు విడనాడాలన్న సూర్యనారాయణ.. ఉద్యోగులందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈరోజు ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉంటే భవిష్యత్ లో ఉద్యోగ సంఘాలు మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుందని కలిసి కట్టుగా ఉంటేనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. సైద్దాంతిక అహంభావాలు విడనాడి..ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ముందుకుపోవాలని సూర్యనారాయణ తెలిపారు. పీఆర్సీ విషయంలో ప్రతి ఒక్క ఉద్యోగికి నష్టం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పగా.. విడుదలైన జీవో చూస్తే అందుకు బిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Actress Murder: గన్నీ బ్యాగ్ లో బంగ్లాదేశ్ నటి మృతదేహం

ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. మరోమారు ముఖ్యమంత్రి జగన్ ను పీఆర్సీ పై పునరాలోచన చేయాలని కోరారు. భజనతో కాదు బాద్యతో మెలిగే ఏకైక ఉద్యోగ సంఘం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అంటూ సూర్యనారాయణ చెప్పారు. సీఎస్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన సూర్యనారాయణ..రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉదృతమయ్యి రాష్ట్రం అట్టుడికి పోకముందే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Also read: Gun firing on sarpanch In AP: శ్రీకాకుళం జిల్లాలో అర్థరాత్రి సర్పంచ్ పై కాల్పులు..!

ట్రెండింగ్ వార్తలు