కరోనా నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరులో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని డా.కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
కరోనా నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరులో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని డా.కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. 14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్స్ ను పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి 840 మంది రాష్ట్రానికి వచ్చారని..వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా కలకలం రేపింది. కరోనా లక్షణాలతో ఓ యువకుడు రిమ్స్ లో చేరాడు. ఇటీవలే ఆ యువకుడు లండన్ నుంచి ఒంగోలు వచ్చాడు. జ్వరం, జలుబు, దగ్గుతో అతడు బాధ పడుతున్నాడు. దీంతో రిమ్స్ లో చేరాడు. ప్రత్యేక వార్డులో వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఆ యువకుడి రక్త నమూనాలు సేకరించిన అధికారులు ల్యాబ్ కి పంపారు. రిపోర్టు కోసం వెయిట్ చేస్తున్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ల్యాబ్ లు, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది. పరిశుభ్రతపై ఫోకస్ పెట్టింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశంలో కంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఎక్కువ ప్రాణాలను బలిగొంటుంది. చైనాలో కంటే మిగిలిన దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువని, చనిపోతున్న వారి శాతం కూడా ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.
Also Read | భారతీయ సంప్రదాయం, దుస్తుల్లో ఆసీస్ క్రికెటర్ ఎంగేజ్ మెంట్