సౌతాఫ్రికా వెనుకబాటుకు మూడు రాజధానులే కారణం

  • Publish Date - December 18, 2019 / 05:00 AM IST

ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన కామెంట్స్ హాట్ హాట్ పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ దీనిని వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాన్ని బాగు చేయాల్సింది..అథోగతి పాలు చేస్తున్నారని, జాబ్స్ ఎలా వస్తాయి ? ఉపాధి ఎలా వస్తుంది ? ఇన్వెస్ట్ మెంట్ ఎలా వస్తాయని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల సూటిగా ప్రశ్నించారు.

ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకొనేటప్పుడు అభివృద్ధి చెందిన దేశాలను తీసుకుంటారా ? వెనుకబడిన దేశాలను తీసుకుంటారా అని ప్రశ్నించారు. సౌతాఫ్రికా దేశాలన్నీ వెనుకబడిపోయాయన్నారు. ఇంకా గందరగోళంలో పెట్టేస్తున్నారన్నారు. కృష్ణపట్నం ఎలా డెవలప్ మెంట్ అయ్యిందో చూడాలన్నారు. జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…

* సీఎం జగన్ ప్రకటనతో ప్రజలు అయోమయంలో పడిపోయే విధంగా ఉంది. 
* ఏపీ ఇక అభివృద్ధి చెందదనే ఉద్దేశ్యం.
* హైదరాబాద్ డెవలప్ అయితే..ఆయన ఆస్తులు మరింత ఎక్కువవుతాయి. 
 

* ఏపీ డెవలప్ మెంట్ కావద్దని నిర్ణయం తీసుకున్నారు. 
* ఏదో కక్ష పెట్టుకున్నారు. 
* మంత్రులు అయోమయంలో పడేశారు. 

ప్రపంచంలో ఏ దేశానికైనా ఒకే రాజధాని ఉందని, తెలంగాణకు కూడా హైదరాబాద్ ఒకటే రాజధాని అని తెలిపారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ రాజధానిగా ఉందన్నారు. కమిటీ వేశారు..కదా..ఆ రిపోర్టు ఇంకా పెండింగ్‌లో ఉండగానే సీఎం జగన్ అసెంబ్లీలో ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటూ..తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. తెలుగు జాతికి తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే..జగన్‌ది తుగ్లక్ పాలన అంటూ విమర్శించారు యనమల.
Read More : రాజధానుల ప్రకటన రగడ : అమరావతి రైతుల ఆగ్రహం..రోడ్డుపై బైఠాయింపు