పట్టాలెక్కనున్న కిరాండుల్ పాసింజర్ : 18నుంచి అరకు రైలు ప్రారంభం..

  • Publish Date - December 12, 2020 / 11:58 AM IST

AP : visakhapatnam to kirandul train will start from december 18th : ఏపీలోని విశాఖ జిల్లాలోని అరకులోయకు డిసెంబర్ 18నుంచి రైలు ప్రారంభం కానుంది. ప్రకృతి ప్రియులకు ఇది శుభవార్తే అని చెప్పొచ్చు. ఏపీలో ప్రసిద్ద పర్యాటక కేంద్రంగా మారిన అరుకులోయకు రైలు సదుపాయాన్ని తిరిగి అమలులోకి తీసుకొచ్చారు అధికారులు.

కరోనా కష్టంతో వచ్చిన లాక్‌డౌన్‌తో మార్చి 22నుంచి నిలిచిపోయిన అరకు రైలుకు రైల్వే అధికారులు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు.. ఈ ప్రాంత ప్రయాణికులు, పర్యాటకుల అభ్యర్థనల మేరకు ఈ నెల 18 నుంచి విశాఖ-కిరండూల్‌ రైలును ప్రత్యేక రైలుగా నడపాలని నిర్ణయించారు. శనివారం (డిసెంబర్ 12,2020) నుంచి టికెట్‌ బుకింగ్‌కు ప్రారంభించారు. ఈ రైలు నంబర్ 08514.

అరకు లోయకు వెళ్లే విశాఖపట్నం-కిరాండుల్ స్పెషల్ రైలు డిసెంబర్ 18నుంచి ప్రారంభంకానుంది. ప్రతీరోజు ఉదయం 6.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ రైలు 20.45 గంటలకు రికాండుల్ కు చేరుకుంటుంది. అలాగే డిసెంబర్ 19 నుంచి కిరాండుల్ లో 6.00గంటలకు కిరాండుల్ లో బయలుదేరి 20.200గంటలకు విశాఖ చేరుకుంటుంది.

ఈ రైలు ఈ నెల 18న విశాఖలో ఉదయం 6.45 నిమిషాలకు బయల్దేరుతుంది. సింహాచలం, కొత్తవలస, అరకు, కోరాపుట్, జెయ్,‌పోర్, జగదల్‌పూర్, దంతేవరా, బచేలి మీదుగా రాత్రి 8.45 నిమిషాలకు కిరాండుల్ చేరుకుంటుంది. కిరాండూల్ నుంచి మళ్లీ విశాఖకు రైలు బయల్దేరుతుంది. రోజూవారీ ఈ ట్రెయిన్ నడుస్తుందని అధికారులు తెలిపారు. ఈ రైలు అరకులో ఐదు నిమిషాల పాటూ ఆగనుంది.