అనంతపురం: రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని కోర్టు కోరడం హర్షించదగ్గ పరిణామం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. స్వాత్రంత్ర్యం వచ్చిన 72 సంవత్సరాల్లో రాఫెల్ పెద్ద కుంభకోణం అని ఆయన అన్నారు. ఈ కుంభకోణంలో ప్రధాని మోడీ దోషిగా తేలి, జైలుకు పోక తప్పదని రఘువీరా జోస్యం చెప్పారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీని ఓడించాలని, ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నారు.
ఏపీ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడిన కేసీఆర్ ను, జగన్ పార్టీ మద్దతు కోరడం చాలా తీవ్ర అన్యాయం చేయడమేనని ఆయన అన్నారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం చాల అవసరమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపిస్తే కేంద్రం నుండి ఏపీకి రావాల్సిన నిధులను రాబట్టేందుకు కృషి చేస్తానని రఘువీరా హామీ ఇచ్చారు. రాహుల్ ప్రధాని కాగానే ఏపీకి ప్రత్యేక హోదా పైనే తొలి సంతకం చేస్తారని అన్నారు.