YSR Congress Party: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాజాగా రీజనల్ కోఆర్డినేటర్లను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి.
- Narender Thiru
- Published On : November 24, 2022 / 09:59 AM IST
YSR Congress Party: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాజాగా రీజనల్ కోఆర్డినేటర్లను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి.
Elon Musk: రోజురోజుకూ తగ్గిపోతున్న ఎలన్ మస్క్ సంపద.. ట్విట్టరే కారణమా?
తాజా నియామకాల ప్రకారం.. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కోఆర్డినేటర్‌గా బొత్స సత్యనారాయణ, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా పిల్లి సుభాష్, మిథున్ రెడ్డి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కో ఆర్డినేటర్లుగా బీద మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డి, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్లుగా బాలినేని శ్రీనివాస రెడ్డి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్‌గా పెద్ది రామ చంద్రారెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్లుగా ఆకేపాటి అమర నాథ్ రెడ్డిని నియమించారు.
