APSRTC Compensation : వరదలో మృతి చెందిన కండక్టర్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం
రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
- bheemraj
- Published On : November 21, 2021 / 01:14 AM IST
Apsrtc
APSRTC Compensation of Rs 50 lakh : కడప జిల్లా రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. రాజంపేట వరదలో మూడు బస్సులు చిక్కుకు పోగా వాటిలో రెండు బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.
మరో బస్సులోని కండక్టర్‌తో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ శనివారం కడప జిల్లాలో పర్యటించారు. బస్టాండ్, గ్యారేజ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఏపీ మొత్తం 1800 బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Tragedy : రంగారెడ్డి జిల్లాలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్, హత్య
రాజంపేట దుర్ఘటన దురదృష్టకరం అని అన్నారు. కండక్టర్ కుటుంబంతోపాటు ప్రయాణికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు.
