సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి మృతి..ఏపీ,తెలంగాణ సీఎంలు సంతాపం

సీనియర్ పాత్రికేయులు,విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి(80) గారు ఇవాళ(అక్టోబర్-28,2019)ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రాఘవాచారి గారి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. నిబద్ధత కలిగిన జర్నలిస్ట్‌గా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్శ ప్రాయం అన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ సానుభూతి తెలిపారు.