Aquaculture Farmers : ఆక్వా రైతుల పోరాటం.. ఫీడ్ ధరల పెంపుపై ఉద్యమం.. చేపలు, రొయ్యల రేట్లు పెరగబోతున్నాయ్..!

Aquaculture Farmers : ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతులు, డీలర్ల ఉద్యమం నేపథ్యంలో మార్కెట్లో చేపలు, రొయ్యల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదివేయండి..

Aquaculture Farmers

Aquaculture Farmers : ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతులు ఉద్యమ బాటపట్టారు. ఫీడ్ ధరలు తగ్గించేవరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. ఆక్వా రైతుల ఉద్యమం ఎఫెక్ట్.. ఇప్పుడు సాధారణ వినియోగదారుల జేబుపై పడేలా కనిపిస్తోంది. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా మేత ధరలను పెంచడమే దీనికి కారణంగా చెప్పవచ్చు.

ఆక్వా సాగు వ్యయం భారీగా పెరిగిపోవడంపై రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారాన్ని ఇక భరించలేమంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులు పట్టుబడులను నిలిపివేసి ఉద్యమాన్ని చేపట్టారు. పెరిగిన ఖర్చులతో సాగు కొనసాగించడం కష్టమని వాపోతున్నారు. అయితే, రైతులకు మద్ధతుగా ఆఖ్వా ఫీడ్ డీలర్లు కూడా షాపులు మూసివేసి ఉద్యమంలో పాల్గొనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఫీడ్ ధరల పెంపుపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫీడ్, మందుల ధరలను నియంత్రించని పక్షంలో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఇదే పరిస్థితి కొనసాగితే చేపలు, రొయ్యల ఉత్పత్తి తగ్గే అవకాశం కనిపిస్తోంది. దాంతో మార్కెట్లో చేపలు, రొయ్యల ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఆక్వా రంగంలో నెలకొన్న ఈ సంక్షోభం రైతులకే మాత్రమే కాదు.. సామాన్య వినియోగదారులపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.

ఆక్వా రైతుల ఆందోళనలు ఉధృతం :
రాష్ట్రంలో ఆక్వా రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఫీడ్ కంపెనీల సిండికేట్ కు వ్యతిరేకంగా ఆక్వా సాగుదారులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పెంచిన మేత ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా పెట్టుబడులను పూర్తిగా నిలిపివేశారు. ఈసారి రైతులకు మద్దుతుగా ఆక్వా ఫీడ్ డీలర్స్ కూడా రంగంలోకి దిగారు. దాంతో ఉద్యమ తీవ్రత మరింత పెరిగింది. ఫీడ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులతో పాటు తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Gudivada Amarnath : ‘ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను.. ఇక రౌండ్ మొదలవుతుంది’ : గుడివాడ అమర్‌నాథ్ వార్నింగ్!

ఆక్వా రైతులకు మద్దుతుగా షాప్స్ మూసివేసి రైతులకు సంఘీభావం తెలిపారు డీలర్లు. ప్రభుత్వం తక్షణమే ఫీడ్ ధరలను నియంత్రించాలని లేకుంటే ఆక్వా సాగు పూర్తిగా నిలిపివేస్తామంటూ రైతులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో ఆక్వా రైతులకు ఫెయిడ్ కంపెనీలకు మధ్య నెలకొన్న ధరల పెంపు వివాదం ఇంకా కొనసాగుతోంది. ఫెయిడ్ కంపెనీల వైఖరిపై ఉద్యమానికి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగానే ఇవాళ రైతులు పట్టుబడులు నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు.

ప్రభుత్వం తక్షణమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఫీడ్ ధరలను నియంత్రించకపోతే ఆక్వా సాగు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రైతులు, డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు అక్వా రైతులు అలాగే డీలర్లు కూడా పాలకొల్లులో ఆక్వా రైతుల బైకుల ర్యాలీని నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టుబడులు నిలిపివేశారు.

ఆక్వా రైతులు కూడా ఈరోజు ఆక్వా రైతులతో పాటుగా వీరికి డీలర్లు కూడా సంఘీభావం తెలిపారు. సిండికేట్ కు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేస్తున్నారు. ఫీడ్ ధరలను పెంచిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టబడులను నిలిపివేశారు ఆక్వా రైతులు. పెరుగుతున్న ఫీడ్ ధరలతో పాటు మెడిసిన్స్ ధరలు తగ్గించే వరకు తమ ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని ఆక్వా రైతుల సంఘం హెచ్చరించింది.