Arasavalli Surya Narayana
Arasavalli Suryanarayana Temple: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు నిరాశే మిగిలింది. ఏటా ఉత్తరాయణంలో అంటే మార్చి 8,9తేదీల్లో, దక్షిణాయానం అక్టోబర్ 1, 2, 3తేదీల్లో కనిపించే అద్భుత ఘట్టం కోసం ఆశగా ఎదురుచూశారు. వాతావరణం ప్రతికూలంగా మారడంతో నిరాశే మిగిలింది.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును సూర్య కిరణాలు తాకలేదు. మంచు, మబ్బుల కారణంగా సూర్య కిరణ స్పర్శ మూలవిరాట్టును చేరలేకపోయింది.
ఈ సందర్శానార్థం అక్కడకు వచ్చిన వందలాది మంది భక్తులు నిరాశకు గురయ్యారు. భక్తులు నిరాశపడొద్దని గురువారం మార్చి 9వ తేదీ సూర్య కిరణ స్పర్శ తాకే అవకాశం ఉందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.
Read Also : వైభవంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవం