Covid Medical Kits: బాలయ్య దాతృత్వం… ఏం చేశారంటే!..

ఎమ్మెల్యే బాలకృష్ణ మరోమారు దాతృత్వాన్ని చాటుకొన్నారు. ఐదు రోజుల క్రితం కొవిడ్‌ రోగులకు మెడికల్‌ కిట్లను అందజేశారు. ఇప్పుడు రెండో విడతగా 2000 కిట్లను ప్రత్యేక వాహనంలో హిందూపురం పంపారు.

Free Medical Kits for Covid Patients : ఎమ్మెల్యే బాలకృష్ణ మరోమారు దాతృత్వాన్ని చాటుకొన్నారు. ఐదు రోజుల క్రితం కొవిడ్‌ రోగులకు మెడికల్‌ కిట్లను అందజేశారు. ఇప్పుడు రెండో విడతగా 2000 కిట్లను (రూ.20లక్షలు విలువైనవి) ప్రత్యేక వాహనంలో హిందూపురం పంపారు. వీటిని గురువారం ఎమ్మెల్యే ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు అవసరమైన వారికి అందించారు. ఎన్‌బీకే సేవా సమితి సౌజన్యంతో వీటిని పంపిణీ చేస్తున్నామన్నారు.

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు, లక్షణాలు ఉన్నవారు, వారి బంధువులు ఈ కిట్లను ఉచితంగా పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా విపత్కర పరస్థితుల్లో తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారన్నారు.గతంలో కూడా ఎమ్మెల్యే రూ.80 లక్షల మందులు, పరికరాలు అందించారని గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు డీఈ రమేష్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మ, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ జెపికె రాము, పార్టీ నాయకులు నెట్టప్ప, ఆదినారాయణ, భాస్కర్‌, రాము, ఉమామహేశ్వరరెడ్డి, విజయలక్ష్మి, మురుగేష్‌, అంజి తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు