AP Inter 1st 2nd Year Results 2026 LIVE: ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. లైవ్ అప్‌డేట్స్..
AP Inter 1st 2nd Year Results 2026 LIVE: ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు.
- Harish Thanniru
- Updated on- April 15, 2026 / 11:59 AM IST
AP Inter 1st 2nd Year Results 2026 LIVE
AP Inter 1st 2nd Year Results 2026 LIVE: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.
మొదటి సంవత్సరంలో పాస్ పర్సంటేజ్ : 77శాతం
4,71,864 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 3,61,526 మంది విద్యార్హులు ఉత్తీర్ణత సాధించారు.
బాలురు 72 శాతం, బాలికలు 81శాతం ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో పాస్ పర్సంటేజ్ : 81శాతం
4,46,537 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,59,816 మంది విద్యార్హులు ఉత్తీర్ణత సాధించారు.
బాలురు 76శాతం, బాలికలు 85శాతం ఉత్తీర్ణత సాధించారు.
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 90శాతంతో.. ద్వితీయ సంవత్సరంలో 92శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 62శాతంతో.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 67శాతంతో అన్నమయ్య జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఒకేషన్ ఫలితాల్లో ..
మొదటి సంవత్సరంలో 38,443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 23,569 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 61శాతం ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 33,852 మంది విద్యార్హులు పరీక్షలకు హాజరు కాగా.. 25,151 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 74శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల్లో సత్తాచాటిన టాప్ -5 జిల్లాలు ఇవే..
మొదటి సంవత్సరంలో..
కృష్ణా: 90%
గుంటూరు: 88%
విశాఖపట్నం: 85%
ఎన్టీఆర్: 84%
పార్వతీపురం మన్యం: 83%
ద్వితీయ సంవత్సరంలో..
కృష్ణా: 92%
2.గుంటూరు: 88%
3.ఎన్టీఆర్: 87%
4.పార్వతీపురం మన్యం: 87%
5.అల్లూరి సీతారామరాజు: 86%
ఏపీలో ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాలు bie.ap.gov.in, resultsbie.ap.gov.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 నెంబర్ Hi అని మెసేజ్ చేసి కూడా ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలు మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 10.31 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా.. 10.57లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 5.31లక్షల మంది మొదటి సంవత్సరంలో.. 5.26లక్షల మంది సెకెండియర్ విద్యార్థులు ఉన్నారు. ఇదిలాఉంటే.. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా అదనంగా ఎంపిక చేసుకున్న ఆరో సబ్జెక్టు మార్కులను జాబితాలో విడిగా ఇస్తారు.
