Group-1 candidates
APPSC: గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-1 మెయిన్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. మెయిన్స్ ఎగ్జామ్ ఆప్షన్ల మార్పునకు ఏపీపీఎస్సీ మరో అవకాశం కల్పించింది. పరీక్ష రాసే అభ్యర్థులు మాధ్యమం, పోస్టులు, జోనల్ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల మార్పు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వెబ్ సైట్ లో ఈ మార్పులు చేసుకోవచ్చునని తెలిపింది.
ఇదిలాఉండగా.. ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు మొత్తం ఏడు పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
పరీక్షల షెడ్యూల్ ..
మే 3వ తేదీ : తెలుగు పేపర్ (అర్హత పరీక్షలు)
మే 4వ తేదీ : ఇంగ్లీష్ పేపర్ (అర్హత పరీక్ష)
మే 5వ తేదీ : పేపర్ -1 ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీ ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ఇతివృత్తాలు, అంశాలపై జనరల్ ఎస్సే పరీక్ష
మే 6వ తేదీ : పేపర్-2 భారతదేశం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక, భౌగోళిక అంశాలపై పరీక్ష.
మే 7వ తేదీ : పేపర్ -3 రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం, నీతి.
మే 8వ తేదీ : పేపర్ -4 భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి.
మే 9వ తేదీ : పేపర్ -5 : సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు